జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్ తీవ్ర విమర్శలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్ తీవ్ర విమర్శలు

Share with
Views : 53

నసేన    అధినేత పవన్ కల్యాణ్   కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్   తీవ్ర విమర్శలు చేశారు. ఏ భార్యతో మూడేళ్లు కాపురం చేయడు మ్యారేజి స్టార్ అంటూ పవన్‌ కళ్యాణ్‌ పై ఫైర్‌ అయ్యారు.భీమవరంలో జగనన్న విద్యా దీవెన   వసతి దీవెన  నిధుల విడుదల సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా 3, 4 ఏళ్లైనా కాపురం చేసి ఉండడని ఎద్దేవా చేశారు.…

పెళ్లి అనే పవిత్ర సంప్రదాయం పక్కన పెట్టి.. కార్లు మార్చుతున్నట్టు భార్యలను మర్చుతున్న పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు..ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు చేస్తే మన చెల్లెళ్ళు, అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్‌. విలువలు, విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలి. భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు.. నాన్ లోకల్.. అని ఫైర్‌ అయ్యారు.

జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న విద్యా దీవెన' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. ఆ వేదిక మీద ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్‌ కల్యాణ్‌లపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.పద్నాలుగేళ్లు ఏళ్లు పాలించిన వ్యక్తి చేసిన మంచి చెప్పి ఓట్లు అడగాలి. అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం అమలు చేసి ఉంటే.. అది చెప్పి ఓట్లు అడగాలని సీఎం జగన్​ అన్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले