సీఎం జగన్ మోసం చేశారు... జాని మాస్టర్‌ ధర్నా..

సీఎం జగన్ మోసం చేశారు... జాని మాస్టర్‌ ధర్నా..

Share with
Views : 61

రో రెండు మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు     జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి సినిమా స్టార్లు కూడా రాజకీయం చేస్తున్నారు.

డైరెక్టర్ ఆర్జీవీ ముందు నుంచీ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్  పవన్ కల్యాణ్  పార్టీ జనసేనకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాజకీయ కార్యక్రమాల్లోనూ జానిమాస్టర్ పాల్గొంటున్నారు. నెల్లూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జానిమాస్టర్ సంఘీభావం ప్రకటించారు. గురువారం దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన చేపట్టారు జాని మాస్టర్.

ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సంగం మండలంలోని తరుణవాయి గ్రామానికి చెందిన రమణమ్మకు రూ.70 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు జానిమాస్టర్. ఈ సందర్భంగా మాట్లాడిన జాని మాస్టర్.. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. మాట తప్పారని విమర్శించారు. ప్రసవం తర్వాత తన భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో తనకు తెలుసని.. అలాంటిది ఎంతోమంది బిడ్డలను ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్‌వాడీ తల్లుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

మీరు వ్యక్తిగతంగా అంగన్వాడీలకు మద్దతు ఇస్తున్నారా? లేదంటే జనసేన తరపున వచ్చారా? అని రిపోర్టు ప్రశ్నించగా.. మీరు ఏమైనా రాసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు పవన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించే డైరెక్టర్ ఆర్జీవీకి కూడా కౌంటర్ ఇచ్చారు. రామ్‌గోపాల్ వర్మకు పవన్ కల్యాణ్ ఎంత ఇష్టమో.. తనకు వైఎస్ జగన్ అంత ఇష్టమని స్పష్టం చేశారు.

ఇక జాని మాస్టర్‌తో పాటు మీడియతో మాట్లాడిన జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌... అంగన్‌వాడీలు ఎంతో మంది పిల్లలకు తల్లుల లాంటి వారని... అలాంటి తల్లుల పట్ల నిర్దయగా వ్యవహరించడమేమిటని విమర్శించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले