‘ఊ.. అంటావా మావా’ ఒక ఊపు ఊపేసింది.

‘ఊ.. అంటావా మావా’ ఒక ఊపు ఊపేసింది.

Share with
Views : 70

అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చి పుష్ప మొదటి పార్ట్‌లో సమంత చేసిన ఐటం సాంగ్ ‘ఊ.. అంటావా మావా’ ఒక ఊపు ఊపేసింది. మరి పుష్ప 2 లో ఐటమ్ గర్ల్ ఎవరు?

అనేది హాట్ టాపిక్‌గా మారింది. హిందీ వెర్షన్‌కి క్రేజ్ తెచ్చేలా ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

డైరెక్టర్ సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. రంగస్థలంలో పూజా హెగ్డే ఐటం సాంగ్ చేయగా.. పుష్ప ఫస్ట్ పార్ట్‌లో సమంత చూసారు. ‘ఊ.. అంటావా.. మావా’ అంటూ సింగర్ ఇంద్రావతి పాడిన పాటకి దేవీశ్రీ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో సైతం ఈ పాటని ప్రదర్శించారు. మరి పుష్ప 2 లో అదే తరహాలో సుకుమార్ ఐటమ్ సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ ఐటమ్ సాంగ్ చేయబోతున్న టాప్ హీరోయిన్ ఎవరై ఉంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

పుష్ప మొదటి పార్ట్ హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్‌లో సైతం తన మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కృతి సనన్ , దిశా పటానీ వంటి నటీమణుల పేర్లు ఐటమ్ సాంగ్‌లో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले