మన ఆరోగ్యం మన చేతుల్లో; పాడు చేసుకుంటుంది మనమే; కిం కర్తవ్యం!! Read more at: https://telugu.oneindi

మన ఆరోగ్యం మన చేతుల్లో; పాడు చేసుకుంటుంది మనమే; కిం కర్తవ్యం!! Read more at: https://telugu.oneindi

Share with
Views : 14
ప్రతి ఒక్కరూ జీవితంలో నిత్యం బిజీగా ఉండడంతో వారిని వెంటాడుతున్న పెద్ద సమస్య ఆరోగ్య సమస్య, అన్ని తెలిసి కూడా ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నామంటే అది మన లోపమే అని చెప్పాలి. గత నాలుగు దశాబ్దాల క్రితం గ్రామాల్లో జీవన విధానానికి, ఇప్పుడు జీవన విధానానికి మార్పు వచ్చింది. ఫలితంగా రోగాలు కూడా గతంతో పోలిస్తే పెరుగుతున్నాయి.

 గతంలో ఉదయం పొలం పనులకు వెళ్లేందుకు మజ్జిగతో కూడిన గడకా (జొన్న అన్నం) ఎక్కువగా తీసుకోవడం వలన పొద్దస్తమానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొలం పనులు చేసుకునేవారు . మరి జీవనవిధానంలో మార్పులు రావడంతో ఆయిల్ తో కూడిన టిఫిన్లు నేడు ప్రతి వంటింట్లో తయారవుతున్నాయి. అలా ఆయిల్ తో కూడిన టిఫిన్ నుండి మొదలుకొని అన్ని ఫాస్ట్ ఫుడ్ లు భుజించడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

 గ్రామాలలో ఒకప్పుడు ఆర్గానిక్ సాగు ఎక్కువగా ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు అధిక దిగుబడుల కోసం ఫెస్టిసైడ్స్ ఉపయోగిచటం వల్ల కూరగాయలు, ఆకుకూరలు కూడా విష తుల్యంగా మారుతున్నాయి. సహజ సిద్ధంగా పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా తీసుకున్న మన పాతతరం మనకంటే ఆరోగ్యంగా జీవించారు.
 తల్లిపాలతో సమానమైన ఆవు పాలు, మేక పాలు ఇలాంటివి కూడా ఎలాంటి కల్తీ లేకుండా దొరికిన రోజులలో ప్రజలు ఆరోగ్యంగా జీవించారు. కల్తీ లేని పాలను తాగిన చిన్న పిల్లలలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచి జ్ఞాపక శక్తితో ఎదిగేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు, ఈ పరిణామాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. మంచి పౌష్టికాహారం తీసుకోవటం, క్రమబద్ధమైన జీవన శైలి అలవాటు చేసుకోవటం, కల్తీ లేని ఆహారాన్ని తీసుకోవటం వంటి చర్యలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనలను కాపాడుతాయి. కాబట్టి ఆహారం మన జీవన విధానాన్ని ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటే, అనారోగ్య బాధలు తగ్గి మన ఆరోగ్యాలలో గణనీయమైన మార్పు వస్తుంది.
 
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले