అఫ్గానిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి

అఫ్గానిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి

Share with
Views : 71

అఫ్గానిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. గత టీ20 ప్రపంచ కప్ నుంచి వీరిద్దరూ టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టులో లేరు.

ఆదివారం అఫ్గానిస్థాన్ తో జరిగే టీ20 సిరీస్ కు సెలక్టర్లు టీమిండియా జట్టును ప్రకటించారు. ఆ జట్టులో రోహిత్, విరాట్ కోహ్లీకి చోటు కల్పించారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగే మ్యాచ్ లలో రోహిత్ సారథ్యంలో భారత్ జట్టు అఫ్గాన్ జట్టుతో తలపడనుంది. 2022 టీ20 వరల్డ్ కప్ తరువాత రోహిత్ శర్మ టీ20ఫార్మాట్ లో ఆడలేదు. ఆ సమయంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ప్రస్తుతం అఫ్గాన్ తో సిరీస్ లో హార్దిక్ కు చోటు దక్కలేదు.

వన్డే ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా జట్టుకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం హార్దిక్ కోలుకుంటున్నాడు. రోహిత్ గైర్హాజరీతో టీ20 ఫార్మాట్ కు హార్దిక్ టీమిండియా సారథిగా కొనసాగారు. పాండ్యా సారథ్యంలో టీమిండియా 16 టీ20 మ్యాచ్ లు ఆడగా.. అందులో 10 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. ఐదు మ్యాచ్ లలో ఓడిపోగా, ఒక మ్యాచ్ టై అయింది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..! కష్టాలు తప్పేలా లేవుగా..!

రోహిత్ శర్మ సుదీర్ఘకాలం టీ20 ఫార్మాట్ లోకి పునరాగమనం తరువాత వచ్చే టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్న అభిమానుల మదిలో మెదలుతోంది. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించబడింది. ఆ మెగా టోర్నీలో కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉంటారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్, విరాట్ లను టీ20 వరల్డ్ కప్ జట్టులో సెలెక్ట్ చేయాలని పలువురు మాజీలు పేర్కొంటున్నారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూటీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాబోయే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించాలని గంగూలీ అన్నారు. విరాట్ కోహ్లీ కూడా టోర్నీలో ఉండాలి. విరాట్ అద్భుతమైన ప్లేయర్ అంటూ గంగూలీ పేర్కొన్నారు

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले