రాజశేఖర్ రెడ్డి మరణంలో ఏపీ కాంగ్రెస్ పాత్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలను ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రర

రాజశేఖర్ రెడ్డి మరణంలో ఏపీ కాంగ్రెస్ పాత్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలను ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రర

Share with
Views : 64

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంలో ఏపీ కాంగ్రెస్ పాత్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలను ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఖండించారు.

రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు జరిగిన మరణం. వైసీపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి లీగల్ నోటీసులు పంపిస్తామని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి, బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రుద్రరాజు అన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ రాజశేఖరరెడ్డి మరణంపై ఎప్పుడూ మాట్లాడలేదు.. వివేకానంద రెడ్డి మరణంలోకూడా జగన్ మోహన్ రెడ్డి ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తరువాత లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయన్స్ సంస్థకు చెందిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడంతో జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ది అర్థమైందని విమర్శించారు. తాడేపల్లి నుంచి బయటకు వస్తే ఏపీలో ఏం జరుగుతుందో సీఎం జగన్ కు అర్థమవుతుందని సూచించారు. రేపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేధావి వర్గం కలిసి వస్తున్నాయని అన్నారు. గాజువాకతో పాటు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి చేరికలు ఉంటాయని గిడుగు రుద్రరాజు చెప్పారు.

జగన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ మరోసారి భారత జోడో న్యాయ యాత్ర చేయబోతున్నారని, జనవరి 14న మణిపూర్ లో యాత్ర ప్రారంభమై 66 రోజులు యాత్ర ఉంటుందని గిడుగు రుద్రరాజు చెప్పారు. 17రాష్ట్రాల మీదగా 337 నియోజకవర్గాల్లో 6,700 కిలో మీటర్లలో జోడో న్యాయ యాత్ర ఉంటుందని అన్నారు.

కాంగ్రెస్ నేత జేడీ శీలం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఏపీలో కూటమి ఏర్పాటు చేస్తున్నామని, విభజన చట్టంలో అంశాలు ఎందుకు అమలు చెయ్యలేదో చెప్పాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తుందని విమర్శించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले