బాలకృష్ణ పొలిటికల్ గా మళ్ళీ బిజీ

బాలకృష్ణ పొలిటికల్ గా మళ్ళీ బిజీ

Share with
Views : 54

బాలకృష్ణ ఇటీవల వరుస సినిమాలతో హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

దీంతో నందమూరి అభిమానులు కూడా జోష్ లో ఉన్నారు. ఇక మరో వైపు పొలిటికల్ గా కూడా మళ్ళీ బిజీ అవుతున్నారు. మరో మూడు నెలల్లో ఏపీ ఎన్నికలు ఉండటంతో ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బావ చంద్రబాబుతో కలిసి కష్టపడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు బాలయ్య.

అయితే తాజాగా బాలకృష్ణ ఓ అభిమాని కోసం చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య అప్పుడప్పుడు అభిమానుల మీద చేయి చేసుకుంటాడు, ఫైర్ అవుతాడు అంటూ పలు వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ అలాంటివి ఆ సందర్భంలో ఉన్న పరిస్థితిని బట్టి రియాక్ట్ అయ్యాడని, స్వతహాగా బాలయ్య మనసు బంగారం అని చాలామందికి తెలుసు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తో ఎంతోమందికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు బాలయ్య.

ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. పలువురు అభిమానులను, కార్యకర్తలను కలిసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఓ వికలాంగుడు బాలయ్య బాబుని కలవడానికి వచ్చాడు. బాలయ్య అభిమాని, తెలుగుదేశం కార్యకర్తగా రాగా ఆ వికలాంగుడు బాలయ్యకు శాలువా కప్పి ఫోటో దిగాలని ఆశపడ్డాడు. ఆ వికలాంగుడు లేచి నిలబడలేడు. దీంతో బాలయ్యే స్వయంగా కుర్చీలోంచి లేచి వచ్చి మోకాళ్ళ మీద కుర్చొని అభిమానితో శాలువా కప్పించుకొని ఫోటో దిగాడు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతైనా మా బాలయ్య బాబు బంగారం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले