అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయిన జనసేనను ఎలా అనుమతించారని ఎలక్షన్ కమిషన్ కి విజయసాయి రెడ్డి పిర్యాదు

అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయిన జనసేనను ఎలా అనుమతించారని ఎలక్షన్ కమిషన్ కి విజయసాయి రెడ్డి పిర్యాదు

Share with
Views : 58

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, భరత్ భేటీ అయ్యారు. ఆరు అంశాలపై వారి నివేదనను అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయిన జనసేనను ఎలా అనుమతించారని ఎలక్షన్ కమిషన్ ను అడిగామని అన్నారు. జనసేన పార్టీ బీజేపీ అలయెన్స్ పార్టీకి కింద పరిగణించారు. నిన్న ఇచ్చిన లెటర్ లో టీడీపీతో అలయెన్స్ పార్టనర్ గా వచ్చారు. ఇలా అనుమతించడం సమంజసమేనా అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగినట్లు చెప్పారు. జనసేన అనేది అన్ రికగ్నైజ్డ్ పార్టీ, గ్లాస్ సింబల్ అనేది కామన్ సింబల్ అని విజయసాయి అన్నారు.

కోనేరు సురేష్ అనేవ్యక్తి పది లక్షల పైచిలుకు ఓట్ల బోగస్ అని సీఈవోకి ఇచ్చాడు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? బీఎల్వోస్ చెప్పాలిగానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారని విజయసాయి అన్నారు. ఆ ఫిర్యాదే భోగస్ అని చర్యలు తీసుకోమని సీఈసీని కోరామని తెలిపారు. వాళ్లు ఎలక్షన్ కమిషన్ టైంను వేస్ట్ చేస్తున్నారని విజయసాయి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇచ్చిన బోగస్ ఓట్లు ఫిర్యాదుపై బోగస్ ఓట్లు అనేవి లేవు అని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఉద్దేశ పూర్వకంగా వైసీపీ సింపథైజర్స్ ను టార్గెట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశాం.టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని, దానిపై ఫిర్యాదు చేసినట్లు విజయసాయి చెప్పారు.

తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారు. ఇలాంటి డూప్లికెట్ ఓటర్లను డిలీట్ చేయాలని సీఈసీని కోరడం జరిగిందని విజయసాయి అన్నారు. తెలంగాణ ఓటర్ లిస్టులో డిలీట్ చేశాకే ఏపీలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని కోరడం జరిగిందని అన్నారు. ఎర్రబుక్ లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నాను.. వాళ్లను సర్వీస్ నుండి తీసేస్తాం అని లోకేశ్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, లోకేశ్ పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎలక్షన్ ఎవరు నిర్వహిస్తారో తెలియకపోవడం శోచనీయమని విజయసాయిరెడ్డి విమర్శించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले