ఉత్తరాదితో సమానంగా వనరుల్లో వాటా రావాల్సిందే.. ఢిల్లీపై ఉమ్మడిపోరుకు దక్షిణాది రెడీ.

ఉత్తరాదితో సమానంగా వనరుల్లో వాటా రావాల్సిందే.. ఢిల్లీపై ఉమ్మడిపోరుకు దక్షిణాది రెడీ.

Share with
Views : 36

 క్షిణ భారతాన్ని ప్రత్యేక దేశం చేయాలంటూ కర్నాటక ఎంపీ DK సురేష్‌ వినిపించిన డిమాండ్‌, కేవలం డిమాండ్‌గానే ఉండిపోయేలా కనిపించడం లేదు. కర్నాటక కేంద్రంగా ఒక బలమైన ఆలోచనకు కసరత్తులు సాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడిపోరుకు దక్షిణాది రాష్ట్రాలను సిద్ధం చేసేలా ప్రణాళికలు సాగుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా చాలా ఇంపాక్ట్‌ చూపేలా బెంగళూరు కేంద్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. కర్నాటక CM సిద్ధరామయ్యకు ఆర్థిక సలహాదారు అయిన బసవరాజ్‌ రాయరెడ్డి ఇందుకోసం కసరత్తులు చేస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కూటమి ఉంటుందని చెబుతున్నారాయన. సమాఖ్య విధానంలో అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉండాలని బసవరాజ్‌ రాయరెడ్డి అంటున్నారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల వాదన జాతీయ స్థాయిలో వినబడటం లేదనీ, అందుకే బలమైన వేదిక అవసరమని రాయరెడ్డి ఇస్తున్న వివరణ. పైకి రాజకీయం గురించి మాట్లాడకున్నా, ఆర్థిక అంశాలనే అజెండా చేసుకోవడానికి తెరవెనక సీన్‌ రెడీ అవుతోంది.

కేంద్రం నుంచి వనరుల్లోనూ, పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలోనూ మీద వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ మొన్నటి నిర్మలా సీతారామన్‌ బడ్జె్‌ట్‌ తర్వాత, DK శివకుమార్‌ తమ్ముడు, కర్నాటక కాంగ్రెస్‌ ఎంపీ అయిన DK సురేష్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులవాటా దక్కడం లేదని మొన్నటిదాకా BRS నేతలు బలంగా వాదన వినిపించారు. ఇక 15వ ఆర్థిక సంఘం- తమకు పన్నుల రూపంలో రావల్సిన ఆదాయం తగినంతగా ఇవ్వలేదని కర్నాటక CM సిద్ధరామయ్య కూడా విమర్శించారు. వనరుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎదుర్కోవడానికి దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని కేరళ మాజీ ఆర్థికమంత్రి TM థామస్‌ గతంలో పిలుపునిచ్చారు.

ఈ పరిస్థితుల్లో ఎల్లుండి, అంటే ఏడో తేదీన ఢిల్లీలో కర్నాటక కాంగ్రెస్‌ విభాగం ధర్నాచేస్తోంది. వనరులు, పన్నుల్లో న్యాయపరమైన వాటా కోసం పోరాటం చేయడం మినహా మరో దారి లేదని DK శివకుమార్‌ అంటున్నారు. అయితే, ఎన్నికల ముందు కర్నాటక ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్‌ అవుతాయన్నదే అసలు పాయింట్‌.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले