రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటని? రాజ్యాంగ ధర్మాసనం

రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటని? రాజ్యాంగ ధర్మాసనం

Share with
Views : 41

ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను జత చేసింది.

పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా న్యాయస్థానం స్వీకరించి విచారణ చేస్తుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాజ్యాంగం అనుమతిస్తుందా..? లేదా అనే దానిపై ఈ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చనుంది. ఇవాళ ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పంజాబ్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు.

అయితే, ఎస్సీ వర్గీకరణకు అన్ని రాష్ట్రాల శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా?.. రిజర్వేషన్లకు సంబంధించి అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటని? రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకోనుంది. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ తెలిపింది.

Eagle: మొదటి రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చింది…

ఇక, ఉషా మెహ్రా కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణపై మోడీ సర్కార్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले