టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక ప్రకటన

టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక ప్రకటన

Share with
Views : 25

టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు (గురువారం) టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు.

సెకండ్ లిస్ట్‌లో ఎంత మంది వీలైతే అంతమంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేస్తామని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ ఏయే స్థానాలలో పోటీ చేయాలో వారికి స్పష్టత ఉందని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లతో పాటు.. పలువురు ఎంపీ క్యాండిడేట్ల పేర్లను సైతం ప్రకటిస్తామని బాబు వెల్లడించారు. కాగా, టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 144 చోట్ల పోటీ చేస్తోంది.

25 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. పొత్తులో భాగంగా 17 ఎంపీ సీట్లలో టీడీపీ బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను ఇటీవల రిలీజ్ చేసింది. ఇందులో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బాబు.. ఎట్టకేలకు క్యాండిడేట్లను ఫైనల్ చేశారు. రేపు సెకండ్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారు. టీడీపీ రెండవ జాబితా విడుదల నేపథ్యంలో ఆశవహులతో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ పార్టీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. కలలకు రెక్కలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఏడాదికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం కార్యక్రమం తీసుకువస్తామన్నారు.

ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివించే అవకాశం కలుగుతుందన్నారు. మగవారితో సమానంగా ఆడపిల్లలు పని చేస్తున్నారన్నారు. మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. మెరుగైన అవకాశాలిస్తే మహిళలు మరింత ముందుకెళ్తారన్నారు.

స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే అది ఎన్టీఆర్ చొరవే అన్నారు. ఉద్యోగాల్లో, కళాశాలల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే అందరూ నవ్వారని.. ఇప్పుడు ఐటీలో మనవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले