తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ కపూల్‌గా ఈ జంట

తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ కపూల్‌గా ఈ జంట

Share with
Views : 29

సినీ స్టార్ కపూల్స్‌లో హీరో సూర్య , హీరోయిన్ జ్యోతిక జంట కూడా ఒకటి. తమిళ ఇండస్ట్రీలో బెస్ట్ కపూల్‌గా ఈ జంట పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఇద్దరూ తమని తాము నిరుపించుకున్నవారే.

కెరీర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇటీవలే తన సెంకడ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్లలను తాన ఖాతాలో వేసుకుంది. ఇక సూర్య విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం సూర్య కంగువ సినిమాల్లో నటిస్తున్నాడు. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

సూర్య ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల నుంచి 30 కోట్లు వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూర్య , జ్యోతికలపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరికి సంబంధించిన ఆస్తులు ఎంతన్నాయి అనేది ఈ వార్త సారాంశం. సూర్య , జ్యోతికల ఆస్తి సుమారుగా రూ. 537 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో సూర్య వాటా రూ.206 కోట్లు కాగా... జ్యోతిక ఆస్తుల విలువ రూ. 331 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది.

దీనిని బట్టి చూస్తే సూర్య కంటే జ్యోతిక ఆస్తుల విలువే ఎక్కువుగా ఉన్నాయన్న మాట. ఇక వీరిద్దరు ఇటీవలే ముంబైలో ఓ ఖరీదైన బిల్డింగ్‌ను కొనుగొలు చేశారు. దీని ఖరీదు రూ .70 కోట్లు వరకు ఉంటుంది. దీంతో పాటు చైన్నైలో అతిపెద్ద ఇల్లుంది. దీని వాల్యూ వందల కోట్లు ఉంటుంది. ఇక సూర్య , జ్యోతిక పేరు మీద ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. మొత్తానికి ఆస్తుల విషయంలో భర్త సూర్య కంటే జ్యోతిక పేరు మీదనే ఆస్తులు ఉండటం సంచలనంగా మారింది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले