కేంద్ర ఎన్నికల సంఘంలో చోటు చేసుకున్న పరిణామాలు- రాజకీయ పార్టీల టెన్షన్

కేంద్ర ఎన్నికల సంఘంలో చోటు చేసుకున్న పరిణామాలు- రాజకీయ పార్టీల టెన్షన్

Share with
Views : 25

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘంలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ పార్టీలను టెన్షన్ లోకి నెట్టేశాయి.

ఇప్పటికే సీఈసీ రాజీవ్ కుమార్ తో పాటు మరో కమిషనర్ అరుణ్ గోయల్ మాత్రమే ఈసీలో ఉన్న నేపథ్యంలో గోయల్ అనూహ్యంగా తప్పుకోవడంతో తప్పనిసరిగా ఆయనతో పాటు మరో కమిషనర్ నూ నియమించక తప్పని పరిస్దితి ఏర్పడింది. మరోవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను సుప్రింకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఈసీకి సమర్పించింది. వీటిని కూడా బయటపెట్టాల్సిన పరిస్దితి.

ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల ఎంపిక, నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం మార్చి 15ను గడువుగా పెట్టుకుంది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఇచ్చిన రాజకీయ పార్టీల విరాళాల వివరాలను తమ వెబ్ సైట్ లో పెట్టేందుకు ఈసీకి ఇచ్చిన గడువు కూడా మార్చి 15 కావడంతో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ రెండు కీలక పరిణామాలు మార్చి 15నే చోటు చేసుకోనుండటం రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

దీనికి కారణం ఎన్నికల కమిషన్లోకి వచ్చే ఇద్దరు కమిషనర్లలో తమకు ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరు ప్రతికూలంగా ఉంటారనే లెక్కల్ని రాజకీయ పార్టీలు అంతర్గతంగా వేసుకుంటున్నాయి. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఎస్బీఐ ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాల్ని బయటపెడితే అందులో తమ జాతకాలు ఎటు నుంచి ఎటు మారిపోతాయో తెలియక అధికార పార్టీలు తలపట్టుకుంటున్నాయి. దీంతో ఈ రెండు పరిణామాలూ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీతో పాటు మరికొన్ని పార్టీలకు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అదీ రెండు పరిణామాలూ ఒకే రోజు చోటు చేసుకోనుండటంతో అందరిలోనూ టెన్షన్ పెరుగుతోంది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले