2014 లో మోడీతో పొత్తుతో రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది

2014 లో మోడీతో పొత్తుతో రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది

Share with
Views : 25

భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక్క ప్రత్యేకహోదా కోసం తప్ప...ఇంకే విషయంలోనూ విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు. పోలవరం ను కేంద్రం కట్టవద్దని చెప్పలేదని.. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా స్టీల్ ప్లాంట్ పై ఎందుకు ఒప్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు ఉన్న ప్రత్యామ్నాయాల పై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శఇంచారు. రైల్ వే జోన్ కు స్థలం కూడా ఇవ్వలేదని జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు.

ఇంగ్లీష్ మీడియం కు ఎవరూ వ్యతిరేకం కాదు.. తామే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు నలిగిపోయాయని గుర్తు చేశారు. హైదరాబాదులో తాను చేసిన అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని అందువల్లే ఉమ్మడి రాష్ట్రం ముందుకెళ్లిందన్నారు. ప్రజల గెలవాలి...రాష్ట్రం నిలబడాలన్నది తమ లక్ష్యమన్నారు. చిలకలూరిపేట నుంచి మంత్రిని ట్రాన్స్ ఫర్ చేసారు... డబ్బులు తీసుకుని అభ్యర్థుల్ని చిలకలూరిపేట కు తీసుకొచ్చారని ఆరోపించారు.

30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. సౌత్ లో తక్కువ వచ్చినా నార్త్ లో బీజేపీ చాలా బాగుందని చెప్తున్నారని గుర్తు చేసారు. ఇక్కడ నేను గెలిచినా కేంద్రం సహకారం లేకుంటే అభివృద్ది కష్టమన్నారు. సీట్ల సర్దుబాటుపై రెచ్చగొట్టే లా మాట్లాడుతున్నారని.. ఓటు చీలకూడడనీ పవన్ నిర్ణయం...వైసీపీ నీ గద్దె దించడమే పవన్ లక్ష్యమని స్పష్టం చేశారు. తాను కూడా గర్వానికి పోకుండా సర్దుకున్నాననని.. ప్రజల కోసం,భావి తరాల కోసం అందరం రాజీ పడ్డామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోలేదని.. ఇప్పుడు అధికారం మారకపోతే చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెబుతున్నారని గుర్తు చేశారు.

హైదరాబాద్ లో ఎకరా అమ్మితే ఏపీ లో 100 ఎకరాలు కొనే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు. అందుకే సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తామన్నారు. ఒకరు ఎక్కువ...ఒకరు తక్కువ అని ఎవరూ భావించలేదని.. టిక్కెట్ రాని వారికి కొంతమందికి బాధ ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే వివిధ పదవులు ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎన్డీయే తో పొత్తు ఇది కొత్త కాదని గుర్తు చేసారు. వాజపేయి హయాంలో ఎలాంటి కండీషన్లు పెట్టకుండా మద్దతు ఇచ్చాని.. రాష్ట్రానికి మంచి చేయాలని అప్పుడు సహకరించాననన్నారు. 2014 లో మోడీతో పొత్తుతో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్ర పథకాలను ఈ ప్రభుత్వం ఉపయోగించుకోలేదని విమర్శలు గుప్పించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले