చరిత్రలో నిలిచిపోయేలా సభకు ఏర్పాట్లు

చరిత్రలో నిలిచిపోయేలా సభకు ఏర్పాట్లు

Share with
Views : 27

ఈనెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే "టీడీపీ-జనసేన-బీజేపీ" సభ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సభా స్థలి వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి TDP National General Secretary Nara Lokesh performed Bhumi Pooja for  Chilakaluripeta public meeting jointly participated by TDP BJP and Janasena  | TDP BJP and Janasena Alliance: చిలకలూరిపేట సభ ఏర్పాట్లు ప్రారంభం ...  లోకేష్ భూమి పూజ చేసి ప్రక్రియ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నారా లోకేష్తోపాటు బీజేపీ, జనసేన నాయకులు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని నారా లోకేష్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద పనులను ప్రారంభించారు.

భూమి పూజ తర్వాత మాట్లాడిన టీడీపీ నేత జీవీ ఆంజనేయులు... ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ చూసిన దాడులు, కేసులు, హత్యలే. ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని రోజులు లెక్క పెడుతున్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్రానికి భవిష్యత్ ఇవ్వడానికి, ప్రజలకు మంచి పాలన అందివ్వడానికి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి భారీగా సీట్ల తేడాతో విజయం సాధిస్తుంది అన్నారు

బీజేపీ లీడర్ నాగభూషణం మాట్లాడుతూ... ఐదేళ్లు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ఈ కనిపిస్తున్న హైవే. రాష్ట్రానికి ఏం చేయకుండా 8 లక్షల కోట్లు అప్పుడు మాత్రం చేశారు. దేశంలో అభివృద్ధితోపాటు రాష్ట్రాన్ని అభివృద్ది చేయలనేు ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. వైసీపీకి నామినేషన్లు వేసే వారు కూడా ఉండబోరు. ఇప్పటికే జనాలను గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు. సీట్లు మారుస్తుండతో వారిలో కేడర్ అయోమయంలో ఉంది. త్రిమూర్తులు కలిసినట్టుగానే మూడు పార్టీలు కలిశాయి. 2014లో ఫలితారులు మళ్లీ వస్తాయి అన్నారు.

టీడీపీ, బీజేపీ, జనసేన 2014 తర్వాత కలిసి ఏర్పాటు చేస్తున్న సభ. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. దీని కోసం భారీగా జనసమీకరణతోపాటు ట్రాఫిక్, సెక్యూరిటీ ఇతర అన్ని అంశాలు పరిశీలించేందుక ప్రత్యేక కమిటీలను టీడీపీ ఏర్పాటు చేసింది. పనులను వివిధ విభాగాలుగా డివైడ్ చేసి 13 కమిటీలకు పనులు అప్పగించింది.

ఇప్పటికే ఈ కమిటీలతో నారా లోకేష్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ సభ ఏర్పాట్లపై మాట్లాడుతూ... "టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించే మీటింగ్ ఏర్పాట్లు పరిశీలిచేందుకు 13 కమిటీలు వేశారు. అందులో మూడు పార్టీలు చెందిన నాయకులు భాగస్వాములుగా ఉన్నారు. మూడు పార్టీల కృషితో చరిత్ర సృష్టిస్తామన్నాం. చిలకలూరి సభతోనే జగన్ రెడ్డి పాలనకు పునాది పడబోతోంది" అని అన్నారు

బీజేపీ లీడర్ యామిని మాట్లాడుతూ... "జగన్ పాలన పోవాలని జనం ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రజలకు ఆశాచిహ్నంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానుంది. మరోసారి ఇలాంటి పాలన రాకుండా చేయడానికే మూడు పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని" అన్నారు.

జనసేన లీడర్ మాట్లాడు... ఎవరు ఎక్కడ ఏ పని చేయాలనే కమిటీల్లో స్పష్టంగా ఉంది. అందరితో లోకేష్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. వైసీపీ పాలనపై జనం పూర్తి విరక్తితో ఉన్నారు. మోదీ ఏం చెప్తారా.. పవన్ ఏ మాట్లాడతారా? ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు చేసే దిశానిర్దేశం ఏంటని ఎదురు చూస్తున్నారు. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. అని అన్నారు.

చిలకలూరిపేటలో జరిగే టీడీపీ, జనసేన, బీజేపీ సభకు ఐదు లక్షల మందికిపైగా జనాలను రప్పించాలని మూడు పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ దిశగానే సభను విజయ వంతం చేయాలని అన్ని పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చాయి. వంద ఎకరాలకుపైగా స్థలంలో మీటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమావేశానికి హాజరయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమానం కొరిశపాడు జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా భద్రతా సిబ్బందితోపాటు ఎయిర్పోర్స్ స్టాఫ్ పరిశీలించారు. చరిత్రలో నిలిచిపోయేలా సభను విజయవంతం చేయాలన్న ఆలోచనతో మూడు పార్టీల నేతలు శ్రమిస్తున్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले