ప్రాణాలు తెగించి ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా:జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ప్రాణాలు తెగించి ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా:జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Share with
Views : 23

తన ప్రాణాలు తెగించి ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. గురువారం నాడు జనసేన (Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

విప్లవకారులు కర్రలు, కత్తులు పట్టుకుని రారని అన్నారు. అన్యాయం జరిగితే ఆక్రోశంతో విప్లవకారులు వస్తారని తెలిపారు. తన పార్టీ కార్యాలయానికి రావడానికి ప్రభుత్వం అనుమతి, పోలీసుల పర్మిషన్ ఎందుకని ప్రశ్నించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తరహాలో తనను తీసుకెళ్లి కొడతారని భయపెట్టారని అన్నారు.

తన ఒంటి మీద దెబ్బ వేస్తే ఊరుకుంటానా అని హెచ్చరించారు. సీఎం జగన్ 'సిద్ధం' చివరి సభకు గ్రాఫిక్స్‌ వాడారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై పవన్ సైటెర్లు గుప్పించారు. వైసీపీ నేతళ్లాగా తాము గ్రాఫిక్స్ వాడమని వాళ్లకే ఆ పిచ్చి ఉందని ఎద్దేవా చేశారు. తన సినిమాల్లో గ్రాఫిక్స్‌ను వాడటానికి ఒప్పుకోనని తేల్చిచెప్పారు. 'సిద్ధం' చివరి సభకు రూ. 15లక్షలు మంది వచ్చారని డబ్బా కొంటుకున్నారని దెప్పిపొడిచారు. 'సిద్ధం' సభల్లో గ్రాఫిక్స్ వాడి మరోసారి వైసీపీ నేతలు అభాసుపాలు అయ్యారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले