నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీలోకి

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీలోకి

Share with
Views : 29

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో హోదాను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు.మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీకి కోరనున్న పోలీసులు

ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఆధారాల ధ్వంసం కేసులో ఇప్పటికే ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అరెస్ట్ చేసిన సమయంలో హార్డ్ డిస్క్‌లు, పలు డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ అంగీకరించారు. ఈ కేసులో ఇతరుల పాత్రపైనా ఆరా తీయనున్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల జాబితాలో ప్రణీత్‌తో పాటు మరికొందరు అని మాత్రమే పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారెవరో తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించింది. ప్రణీత్ ఉపయోగించిన రెండు గదులు, 17 కంప్యూటర్లను పరిశీలించింది. ఎవరెవరి సీడీఆర్, ఐఎంఈఐ, ఐపీడీఆర్ సేకరించారు.. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారనే దానిపై ఆరా తీస్తోంది. ఈ కేసులో ప్రణీత్ అధీనంలో పనిచేసిన ఎస్వోటీ సిబ్బందిని కూడా నిందితులుగా చేర్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले