ఏ బీ పి సర్వే టిడిపి కూటమి స్వీప్

ఏ బీ పి సర్వే టిడిపి కూటమి స్వీప్

Share with
Views : 384
ఏబీపీ సీఓటర్ పేరుతో ఇటీవల వైసీపీ నేతలు ఓ పోస్టర్ వైరల్ చేసుకున్నారు. వైసీపీ గెలుస్తుందని ఓ పోస్టర్ సారాంశం. భారీగా ఖర్చు పెట్టి వైరల్ చేసుకున్నారేమో కానీ ఆ సంస్థ అది ఫేక్ అని అప్పుడే క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే ఒక్క రోజు ముందు ఏబీపీ- సీఓటర్ ఒపీనియన్ పోల్ వెల్లడిస్తారు. ఈ సారి కూడా అలాగే వెల్లడించారు. రియల్ ఫిగర్స్ చూసి వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది.ఎందుకంటే వారు ప్రచారం చేసుకున్న దానికి రివర్స్ లో ఉంది పోల్ ఫలితం. ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా..అందులో ఇరవై స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించనుంది. మరో ఐదు స్థానాల్లో మాత్రమే.. అధికార వైసీపీ విజయం సాధించబోతున్నట్లుగా తేలింది. ఎన్డీఏ కూటమికి 45 శాతం ఓట్లు వస్తాయని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమికి మూడు శాతం రాగా.. ఇతరులకు పది శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక సీట్ల పరంగా చూస్తే.. బీజేపీ మూడు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన పదిహేడు స్థానాల్లో విజయం సాధించనున్నాయి. మొత్తంగా ఈ కూటమికి ఇరవై స్థానాలు వస్తాయని సీఓటర్ సర్వేలో తేలింది. తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపు కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలుచుకుంటుందని తాజాగా నిర్వహించిన ఏబీపీ – సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో వెల్లడయింది. బీజేపీకి నాలుగు లోక్ సభ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇక న్యూస్ 18 నిర్వహించిన మెగా ఒపీనియన్ పోల్‌లోనూ ఏపీలో ఎన్డీఏ కూటమికి యాభై శాతం ఓట్లు 18 లోక్‌సభ సీట్లు వస్తాయని తేలింది. ఈటీజీ లాంటి తాడేపల్లి కంపెనీల సర్వేలు తప్ప.. నిఖార్సుగా బ్రాండ్‌గా సర్వేలు చేసే సంస్థలన్నీ ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయని తేలుస్తున్నాయి.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले