ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డికి అసలు అంతఃకరణ శుద్ధి అంటే అసలు అర్ధం తెలుసా..? వైఎస్ సునీత:

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డికి అసలు అంతఃకరణ శుద్ధి అంటే అసలు అర్ధం తెలుసా..? వైఎస్ సునీత:

Share with
Views : 23

ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ సునీత కడపలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వివేకానంద రెడ్డి చనిపోయి నేటికి ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా నేటీకి ఆ కేసు కొలిక్కి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా చనిపోయారని తెలిసిన వెంటనే అందరూ హుటాహుటీన పులివెందలకు చేరుకుంటే జగన్ మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

రాగద్వేషాలకు అతీతంగా అంతఃకరణ శుద్దితో పని చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డికి అసలు అంతఃకరణ శుద్ధి అంటే అసలు అర్ధం తెలుసా..? అని ప్రశ్నించారు. మీ చిన్నానని అతి క్రూరంగా చంపిన వారికి, చంపించిన వారికి శిక్షపడేలా చేసే బాధ్యత మీకు ఉందని.. అయినా ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు పని చెయ్యలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా మీరు చేసిన ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేక పోతున్నారని అడిగారు.

నేరస్థులకు శిక్షపడేలా పోరాటాలు చేస్తున్న తన పైన అదే నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారని ఇది సమంజసమా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కానీ, తన కుటుంబం కానీ హత్య చేసి ఉంటే తమని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్తానంలో ఉండి సునీత హత్య చేసింది అని చెప్పడానికి ఎబ్బెట్టుగా లేదా అని మండిపడ్డారు. అధికారంలో ఉండి ఆరోపణలు చెయ్యడానికి సిగ్గుగా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం లో ఉన్న మీరు చర్యలు తీసుకోకుండా ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు..? ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఫిర్యాదుచేస్తున్నారా..? లేక ప్రజలకు ఫిర్యాదు చేస్తున్నారా..? అని ఎద్దేవ చేశారు. ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్లకు అదింస్తే 5 లక్షలు రివార్డ్ ఇస్తామని సిబిఐ పేపర్ ప్రకటన కూడా ఇచ్చిందని.. తామే చంపినట్టు మీదగ్గర సాక్ష్యాలు ఉంటే తమ గురించి సమాచారం ఇవ్వొచ్చుగా.. ఇస్తే ఐదు లక్షలు బహుమతి కూడా వస్తుంది కదా మరి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఇక వివేకానంద రెడ్డి రక్తం, కోడికత్తి శ్రీనివాస్ రక్తంలో వైసీపీ పునాదులు మునిగి ఉన్నాయని పేర్కొన్నారు. కొడుకు కోసం పదవులు త్యాగం చేసిన చిన్నానకి, అన్న కోసం రాత్రిబవళ్ళు తిరిగిన చెల్లికి జగన్ ఇచ్చిన కానుకలను మనం చూశామని.. ఇకనైనా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు రండి.. లేకపోతే ఆ పాపం మీకు అంటుకుంటుందని సునీత వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले