ఉమ్మడి సభకు 'ప్రజాగళం' పేరు ఖరారు

ఉమ్మడి సభకు 'ప్రజాగళం' పేరు ఖరారు

Share with
Views : 31

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు పెట్టుకున్న సందర్భంగా ఈ నెల 17న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. ఈ ఉమ్మడి సభకు 'ప్రజాగళం' పేరు ఖరారు చేశారు.

ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈనెల 17న మధ్యాహ్నం చిలకలూరిపేటలో ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ రానున్నారు.

కాగా ఈ ఉమ్మడి సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు కోరారు. నరేంద్ర మోదీ పర్యటనపై ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కూడిన కమిటీని నిన్న నియమించారు. ప్రధాని మోదీ ఈ నెల 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పిడిలో బీజేపీ-టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం భారీ సభకు హాజరు కానున్నారు.

పదేళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించననున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దశ దిశా నిర్దేశం చేయుటకు అతిరథమహారధులు, మహానాయకులు విచ్చేస్తున్నారు. ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీలకు చెందిన నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले