సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది

సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది

Share with
Views : 28

సుప్రీంకోర్టు సంచలన తీర్పు మేరకు తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ డేటాను ఈసీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించగా ఆ వివరాలను ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్లో అధికారికంగా ప్రకటించింది.

రెండు భాగాలుగా ప్రకటించిన 337 పేజీల డేటా ఆధారంగా 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకూ 11వేల 671కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశాయి. ఏ కంపెనీ ఏ రాజకీయపార్టీకి ఎంత విరాళాలు ఇచ్చింది అనే విషయాన్ని ఈసీ వెల్లడించకపోయినా ఏ కంపెనీ ఎన్ని కోట్ల డబ్బులు పార్టీల కోసం ఇస్తున్నాయో ఓ క్లారిటీ వచ్చింది.

పార్టీల వారీగా లెక్కలు చూస్తే

జాతీయ పార్టీలైన బీజేపీకి అత్యధికంగా రూ.6,061కోట్లు, కాంగ్రెస్ కోసం రూ.1,422 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా తృణమూల్ కోసం రూ.1,610 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల విషయానికి వస్తే
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ఎన్నికల బాండ్ల విరాళాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఆపార్టీకి ఇప్పటివరకూ 337కోట్ల రూపాయలు అధికారికంగా అందాయి. రూ.219కోట్లతో రెండోస్థానంలో టీడీపీ, రూ.21కోట్ల రూపాయల విరాళాలు పొంది జనసేన మూడోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.

పార్టీలకు విరాళాలు కంపెనీలు :

బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతీ మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర, తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగిన మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇక్కడో ఇంకో సీరియస్ విషయం ఏంటంటే.. అసలు అంతగా పేరులేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే సంస్థ దేశంలోనే అత్యధికంగా 1,368కోట్ల రూపాయలు విరాళాలను పొలిటికల్ పార్టీలకు బాండ్ల రూపంలో కొనిపెట్టింది. ఇంతకీ ఈ కంపెనీ వివరాలు ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇదో డొల్ల కంపెనీ అనే అనుమానాలతో 2022 మార్చి నుంచి ఈడీ రైడ్స్ కూడా జరుగుతున్నాయి దీని మీద. సో ఈ కంపెనీ 1368కోట్ల రూపాయలు ఏ పార్టీకి ఇచ్చింది ప్రస్తుతానికైతే సీక్రెట్.

ఇప్పటి వరకు ప్రకటించిన డేటాలో ఉన్న కొన్ని కంపెనీలు పాకిస్థాన్ బేస్డ్గా నడుస్తున్నాయేన చర్చ సాగుతోంది. ఆ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియడం లేదు. మరోవైపు యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూ.162 కోట్లు, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్ సొంతంగా రూ.35 కోట్లు, ఆయన కంపెనీలు మరో రూ.247 కోట్ల విలువైన బాండ్లు కొన్నాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్: రూ.123 కోట్లు. బిర్లా కార్బన్ ఇండియా: రూ.105 కోట్ల రూపాయల బాండ్ల కొనుగోలు చేశాయి. .

తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది.

మరికొన్ని తెలుగు కంపెనీల వివరాలు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: రూ.80 కోట్లు
హెటిరో గ్రూప్: రూ.60 కోట్లు'
నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్: రూ.55 కోట్లు
దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: రూ.55 కోట్లు
అరబిందో ఫార్మా లిమిటెడ్: రూ.50 కోట్లు
రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.45 కోట్లు
మైహోం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్: రూ.25 కోట్లు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్: రూ.10 కోట్లు
శ్రీచైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్: రూ.6 కోట్లు

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले