హింస, రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీలకు ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం

హింస, రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీలకు ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం

Share with
Views : 21

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం సిద్దమవుతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేయబోతోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముకేష్ కుమార్ మీనా ఇవాళ కీలక సమీక్ష చేశారు. ఇందులో జిల్లా ఎస్పీలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈసారి రాష్ట్రంలో హింస, రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీలకు ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యతని తెలిపారు. హింసాత్మక ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే సదరు ఎస్పీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తద్వారా హింసను అరికట్టాల్సిందేనని తేల్చిచెప్పేశారు.మరోవైపు రాష్టంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచీ పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతామని సీఈవో తెలిపారు.పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామన్నారు. ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని సీఈవో తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉందన్నారు. అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले