బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల్లో అధికారులపై వేటు

బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల్లో అధికారులపై వేటు

Share with
Views : 25

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

అయితే ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం చాలా పగడ్బందిగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగిలే ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో అధికారులపై యాక్షన్ మొదలు పెట్టింది.

6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఎన్నికల కమిషన్ తొలగించింది.

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్నికల కమిషన్ తీసుకున్న తొలి యాక్షన్ ఇదే. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో పాటు అదనంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శులను కూడా తొలగించింది. ఇక పశ్చిమ బెంగాల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)పై చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగించింది.

లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన రెండు రోజులకే ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న అన్ని స్థానాలకు కౌంటింగ్ జరగనుంది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले