గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..

Share with
Views : 27

లోకసభ ఎన్నికల వేళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు.

అదేవిధంగా పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామాను సమర్పించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తు్న్న దృష్ట్యా కొత్త గవర్నర్ నియామకం ప్రస్తుతం లేనట్లుగనే తెలుస్తోంది. దీంతో మరో రాష్ట్ర గవర్నర్‌కు తెలంగాణ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले