ఏపీ భవన్ విభజన పైన కేంద్రం గజెట్ జారీ చేసింది

ఏపీ భవన్ విభజన పైన కేంద్రం గజెట్ జారీ చేసింది

Share with
Views : 25

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇదే సమయంలో కేంద్ర రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.

ఏపీ భవన్‌ను విభజన చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ తాజాగా స్పష్టత ఇచ్చింది.

ఏపీ భవన్ విభజన పైన కేంద్రం గజెట్ జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది. ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు.. ఏపీ వాటాగా11.536 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయించారు.

అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్‌లో 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అయితే, గతంలో కేసీఆర్ హయాంలో ఏపీ భవన్‌ విభజన పూర్తవగానే అక్కడ తెలంగాణ భవన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పటౌడీ హౌస్‌లోని 5.245 ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావించింది. శబరి బ్లాక్‌ చాలా పురాతనమైనది కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా..లేక ఆ బ్లాక్‌ను యథాతథంగా ఉంచి పటౌడీ హౌస్‌లోని 5.245ఎకరాల ఖాళీ జాగాలో నిర్మిస్తే సరిపోతుందా అనే దాని పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తాజాగా కేంద్రం చేసిన ప్రతిపాదనలకు రెండు ప్రభుత్వాలు ఆమోదం తెలపటంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఒప్పందం మేరకు కేటాయింపులు చేస్తూ కేంద్రం హోం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు రెండు ప్రభుత్వాలకు ఒక కీలక అంశంలో రిలీఫ్ దక్కింది.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले