కోడ్ వచ్చిన మొదటి రోజే ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారు.

కోడ్ వచ్చిన మొదటి రోజే ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారు.

Share with
Views : 28
ఈసీనే ప్రభుత్వాన్ని నడుపుతుంది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ.. నిబంధనల ఉల్లంఘన వంటి విషయాల్లో ఈసీ ఆదేశాలను సంపూర్ణంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారవర్గంపై ఉంటుంది. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏపీ కోడ్ వచ్చినా సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కనీసం పట్టించుకోవడం లేదు. విచిత్రంగా సీఎస్ కోడ్ అమలుపై సమీక్షలు చేస్తున్నారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. సీఈవో మీనా ఆదేశించినా ఓ కలెక్టర్ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించలేదు. ఇదేమిటని అడిగితే… కింది అధికారికి చెప్పానని తనకేం తెలుసని ఆయన ఎదురు ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. సీఈవోపై ఓ కలెక్టర్ కు ఇంత గౌరవం ఉంటే.. ఇక రాష్ట్ర స్థాయిలో ఆయనను పట్టించుకునేవారు ఎవరు ఉంటారు ?. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నేతల అండదండలతో అర్థరాత్రి .. కోడ్ పేరుతో ప్రైవేటు ఆస్తులపై దాడి చేస్తున్నారు. వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పెయింటింగ్‌లు పబ్లిక్ ఆస్తుల్లో ఉన్నా పట్టించుకోని వారు .. విపక్షాలకు చెందిన ప్లెక్సీలు, బ్యానర్లు ప్రైవేటు ఆస్తుల్లో ఉన్నా ఎగబడుతున్నారు. ఇక శాంతిభద్రతల పరిస్థితి మొదట్లోనే వివాదాస్పదంగా మారింది. కోడ్ వచ్చిన మొదటి రోజే ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసులు పెట్టారా… నిందితుల్ని అరెస్టు చేశారా అన్నదానిపై ఎవరికీ వివరాలు తెలియవు. ఇక స్వయంగా ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం జరిగినా.. రెడ్డి ఆఫీసర్లందర్నీ.. విధులకు ఏర్పాటు చేసి.. సభపై భారీ కుట్ర జరిగినట్లుగా స్పష్టమైనా ఇంత వరకూ చర్యలు లేవు. చివరికి ఐబీ నివేదికలపై ఆధారపడాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం కాస్త మెత్తగా ఉంటే… ఏపీలో జరిగే అరాచకాల్ని ఊహించడం కష్టం. అత్యంత కఠినంగా ఉంటేనే.. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరుగుతున్నాయి. గెలవడానికి రక్తపాతం సృష్టించడానికి కూడా వెనుకాడని మైండ్ సెట్ ఉన్న రాజకీయ నేతలు ఇప్పుడు … అధికారం నిలబెట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసేలా.. నిబంధనలు అమలు జరిగేలా చూడాల్సిన ఈసీ .. ఇప్పుడు కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले