మాధవి భయపడని రాజకీయం

మాధవి భయపడని రాజకీయం

Share with
Views : 27
కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ రెడ్డప్పగారి మాధవి. తనది కడప అని గర్వంగా చెప్పుకునేలా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారు. కడపామె అని అందరూ గుర్తు పట్టేలా రాజకీయం చేస్తున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులు ఆమెను భయపెట్టాలని చూసినా .. పక్కన కుమార్తె ఉన్నా తగ్గలేదు. ధైర్యంగా నిలబడ్డారు. పోలీసులు వచ్చి వంశీ అనుచరులకే మద్దతు పలికేలా మాట్లాడినా వెనక్కి తగ్గలేదు. ఆమె ధైర్యం చంద్రబాబును కూడా మెప్పించింది. వర్క్ షాప్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెడ్డప్పగారి మాధవి .. కడప టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి భార్య. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చారు. మహిళా కోటాలో పోటీకి చాన్సు ఇస్తారేమో అనుకున్నారు. కానీ కడప ఇంచార్జ్ గా అవకాశం పొందిన రెండు నెలల్లోనే మహిళా కోటాలో వచ్చింది కాదు.. లీడర్ షిప్ క్వాలిటీస్ చూసే ఇచ్చారని నిరూపించుకున్నారు. కడపలో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. విస్తృృతంగా ప్రచారం చేస్తున్నారు. సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజలకు అండగా ఉండే విషయంలో తాను భయపడేది లేదని గట్టిగానే చేతలతో నిరూపిస్తున్నారు. మంచి విషయ పరిజ్ఞానం ఉండటంతో.. ప్రజల ఆదరాభిమానాల్ని పొందుతున్నారు. కడపలో సరైన నేత ఉంటే టీడీపీ గట్టి పోటీ ఇస్తూ ఉంటుంది. గత రెండు, మూడు ఎన్నికల్లో టీడీపీకి అలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడా సమస్యను రెడ్డప్పగారి మాధవి తీర్చేస్తున్నారు. సరైన నాయకురాలన్న అభిప్రాయన్ని కల్పిస్తున్నారు. ఒక్క కడపలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले