ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర.

Share with
Views : 27
పత్రికా సమావేశం వివరాలు – మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయం తేది.23.03.2024 *ల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ రెడ్డి చట్టం చేస్తున్న మూకుమ్మడి హత్యలు* • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర. • జగన్ రెడ్డి పాలనలో ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేదు • రాష్ట్రంలోని సహజవనరులను దోచుకున్న వైసీపీ వారు ఇప్పుడు ప్రజల స్థిరాస్తులపై పడ్డారు • ప్రజల స్థిరాస్తులను లాక్కుంటూ.. మూకుమ్మడి ఆత్మహత్యలను ప్రేరేపిస్తూ.. జగన్ రెడ్డి కుటుంబాలను చిధ్రం చేస్తున్నాడు. • ప్రజలు ఓటుతో జగన్ రెడ్డికి బుద్ఢి చెప్పి వ్యవస్థలను కాపాడాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. • బీసీల మాన, మాన, ప్రాణాలకు రక్షణ కావాలంటే చంద్రబాబును సి.ఎం చేసుకోవాలి. - రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహనరాజు మంగళగిరి: భూ హక్కు చట్టం పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారని, రాష్ట్రంలో ప్రజల ఆస్థులకు రక్షణ లేకుండా పోయిందని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహనరాజు ఆవేదన వక్తం చేశారు. కడప జిల్లా, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరంలో బీసీ చేనేత కుటుంబానికి చెందిన పాలా సుబ్బారావుకు చెందిన మూడెకరాల భూమి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు లాక్కోవడంతో మొత్తం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రజల ఆస్తులు ఏవిధంగా అన్యాక్రాంతం అవుతున్నాయో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ అని వివరించారు. మూకుమ్మడిగా చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. ‘కొత్త మాధవరానికి చెందిన పాలా సుబ్బారావు చేనేత కార్మికుడు. సుబ్బారావు నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామంలోని సర్వే నెం.2187/2, ఖతా నెం.1712 లో 3.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కొత్తగా వస్తున్న తిరుపతి-కడప ఎక్స్ ప్రెస్ వే ప్రక్కనే ఉండటంతో దాని విలువ కోట్లలోకి వెళ్లింది. దీంతో ఆ భూమిపై వైసీపీకి చెందిన కట్టా శ్రావణి కుటుంబం కన్నేసింది. వెంటనే ఎమ్మార్వోను ప్రలోభ పెట్టి ఆ మొత్తం భూమిని కట్టా శ్రావణి పేరు మీదకు మార్చుకున్నారు. ఒక పేద చేనేత కార్మికుడికి చెందిన మూడెకరాల భూమిని అధికారం అడ్డంపెట్టుకుని లాక్కోవడం మనస్థాపానికి చెందిన సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు ప్రక్కగా వెళుతున్న రైల్లే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోగా.. ఆయన సతీమణి పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వైసీపీ ఏ విధంగా బీసీల భూములు లాక్కుంటున్నారో రాష్ట్రంలోని బీసీలు అర్ధం చేసుకోవాలన్నారు. సుబ్బారావు మరణవాగ్మాలం చదువుతుంటే హృదయవిధారకంగా ఉందని వాపోయారు. *పాలా సుబ్బారావు మరణ వాగ్మూలం...* గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, మేము చేనేత కార్మికులం. మా నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామ పొలంలో s.no 2187/2 నాన్న పేరుతో ఎ 3.10 ఎకరాలు పొలం ఉంది. ఖాతా 302712 PM కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి. మేము ఇటీవల పొలం అమ్ముకోవాలని వెళితే కట్టా శ్రావణి పేరుతో రికార్డులు ఉన్నాయి అని చెప్పారు. మా పేరుతో ఉండే రికార్డు వాళ్ళ పేరుతో ఎలా మారాయి? ఏ సంవత్సరంలో మార్చారు? వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రార్థన. మేము ఆ పొలం మీద పిల్లల కోసం పెట్టుకొని ఉన్నాము. మా నాన్నకి కరోనా వచ్చి 4 లక్షలు ఖర్చు పెట్టాము. తమ్ముడు పెళ్ళికి 3 లక్షలు ఖర్చు పెట్టాము. మేము ఏమి చేయాలో తెలియక చనిపోతున్నాము. మా ఇంట్లో వారికి కాని, మాకు అప్పు ఇచ్చిన వారికి ఏమి సంబంధం లేదు. MRO... లంచం తీసుకొని మాలాంటి వాళ్ళని నాశనం చేయోద్దు’ ఇది జగన్ రెడ్డి చట్టం చేసిన హత్యలు కావా? జగన్ రెడ్డి తీసుకొచ్చిన భూ హక్కు చట్టం చాలా ప్రమాదకరమైనది. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో ఎవరి ఆస్తి ఎవరి చేతిల్లో ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రజల ఆస్తి హక్కును కాలరాస్తున్నారు. ఏ రాష్ట్రమూ ఇంతటి ప్రమాదకర చట్టం చేయలేదు.పౌరుల భూహక్కుల్ని సివిల్ కోర్టులు రక్షిస్తున్నాయి. కోర్టుల రక్షణను తొలగించడానికే రెవెన్యూ అధికారులకు సివిల్ కోర్టు అధికారాలను కట్టబెడుతూ ఈ చట్టం తెచ్చారు. ఈ నల్లచట్టంతో జగన్ రెడ్డి, ఆయన ముఠా భూముల్ని ఇష్టారీతిన కొట్టేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ రెడ్డి ప్రజల స్థిరాస్తులపై పడ్డారు. భూ కబ్జాదారులకు వరంగా ఈ చట్టం మారుతుంది. కోర్టుల అధికారాలు లాగేసి అధికారులకే హక్కుల నిర్ణయాధికారం కట్టబెట్టడం జగన్ రెడ్డి పెత్తందారీతనానికి నిదర్శనం. భూమి వివాదంలో ఉన్నా, లేకున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఇతరుల పేర్లను టైటిల్ రిజిస్టర్లలో ఎక్కిస్తున్నారు. జగన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఓడించకపోతే..ప్రజల ఆస్తులు ఉండవు. నేడు కడపలో జరిగిన మూకుమ్మడి ఆత్మహత్య వలే కుటుంబాలు చిధ్రమైపోతాయి. ప్రజల మాన, ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు దీనిని సీరియస్‌గా ఆలోచించాలి. వ్యవస్థలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని జగన్మోహన రాజు కోరారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले