భువనేశ్వరితో శ్రామిక మహిళలు మాట్లాడుతూ....*

భువనేశ్వరితో శ్రామిక మహిళలు మాట్లాడుతూ....*

Share with
Views : 31
*భువనేశ్వరితో శ్రామిక మహిళలు మాట్లాడుతూ....* *సబీరా:* నా భర్త యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎవరూ మా కుటుంబాన్ని పట్టించుకోలేదు. గతంలో చంద్రన్న బీమా డబ్బులు వచ్చేవి. వైసీపీ పాలనలో మాకు ఎలాంటి సాయం అందలేదు. మా కుటుంబాన్ని ఆదుకునేవారి కోసం చూస్తున్నాం. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. *రమాదేవి:* మేము రొయ్యల ఫ్యాక్టరీకి వెళతాం. రోజుకు కేవలం రూ.250మాత్రమే ఇస్తున్నారు. జీతాలు పెంచాలని అడిగితే కరెంటు బిల్లులు పెరిగాయి, కుదరదని అంటున్నారు. మా పిల్లను చదివించుకోలేని పరిస్థితి. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. టీడీపీ పాలనలో ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఉండేది. వైసీపీ పాలనలో ఖర్చులు పెంచేసి, డబ్బులు ఇస్తున్నానని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఆదుకోవాలి. *గోను మంగమ్మ:* మాకు ముగ్గురు ఆడపిల్లలు. నా భర్త చనిపోతే కనీసం ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదు. ప్రభుత్వ అధికారులను అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఉపాధి హామీ పథకంలో కేలం 100రోజులు మాత్రమే ఇస్తున్నారు. 200రోజులకు పెంచితేనే మాకు ఉపాధి, జీవనోపాధి సరిపోతుంది. సౌకర్యాలు కూడా మాకు సరిగా అందడం లేదు. *రాజ్యలక్ష్మి:* మేమంతా గతంలో ఇసుక మైనింగ్ పనులు చేసుకుని బ్రతికేవాళ్లం. టీడీపీ పాలనలో పనులు మాకు పుష్కలంగా ఉండేవి. గత ఐదేళ్లుగా మాకు పనులు తగ్గిపోయాయియ. ఇసుక మైనింగ్ చెన్నై వాళ్లకు ఇవ్వడంతో మమ్మల్ని పనుల్లోకి తీసుకోవడం లేదు. రోడ్లు సరిగే లేకపోవడంతో ప్రాణాలకు తెగించి ఇసుక వాహనాలపై ప్రయాణం చేస్తున్నాం. మాకు ఉపాధి పెంచేలా చర్యలు తీసుకోవాలి. *శ్రావణి:* నా తండ్రి చనిపోయాడు. డిగ్రీ చదువుకుంటున్నాను. నేను పై చదువులు చదవాలని అనుకుంటున్న సమయంలో కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ప్రకటించడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ కార్యక్రమాన్ని అందరికీ అమలు చేస్తారా? *ఈ సందర్భంగా భువనేశ్వరి స్పందిస్తూ....* *చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రోజువారి శ్రమ చేసుకునే మహిళలకు ఊతమందిస్తారు. వారి కోసమే సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టారు. శ్రామిక మహిళలకు మరింత ఆర్థిక బలాన్ని చేకూర్చేందుకు చంద్రబాబు అనేక పథకాలు తీసుకొస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం శ్రామిక మహిళలకు చాలా అవసరం. తెలుగుదేశం,జనసేన,బీజేపీ కూటమి పేదవారి కష్టాలు తీర్చడానికి పనిచేస్తాయి అని భువనేశ్వరి పేర్కొన్నారు.*
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले