టిడిపి కి డి యల్ రవీంద్ర రెడ్డి మద్దతు

టిడిపి కి డి యల్ రవీంద్ర రెడ్డి మద్దతు

Share with
Views : 14
గత ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో మనం మనం రెడ్లం అని సెంటిమెంట్ తో .. డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈ సారి ఆ సెంటిమెంట్ పని చేయడం లేదు. డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ప్రకటించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఫ్పై సీట్లలో ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయన్నారు. మైదుకూరు ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ ను గెలిపించాలన్నారు. ఇక ఎంపీ సీటు విషయంలోనూ రవీంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కూటమికి ఓటు వేయాలని చెప్పలేదు కానీ.. వివేకం సినిమాను చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కడప లోక్ సభ ఓటర్లకు సూచించారు. ఈ సినిమాను చూసిన ఎవరైనా అవినాష్ రెడ్డికి ఓటు వేయరు. అంటే ఆయనకు వేయవద్దని చెబుతున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టి షర్మిల, సునీతకు మద్దతు ఇవ్వాలని డీఎల్ పరోక్షంగా చెప్పినట్లయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకుడైన డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి ఆరు సార్లు గెలిచారు. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల సమయంలో ఆయనను.. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. జగన్ .. మనం మనం రెడ్లమని ఉబ్బేయడంతో పార్టీలో చేరానని .. తర్వాత అదెంత తప్పో తెలిసి వచ్చిందని ఇటీవల ఆయన తరచూ బాధపడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీలో చేరుతారని అనుకున్నారు కానీ.. చేరలేదు. ఇప్పుడు టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले