కవితకు బిగ్ షాక్
Share with
Views : 14
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమె మధ్యంతర బెయిల్ ను నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. 14 రోజులపాటు కవితకు కస్టడీని పొడిగించింది. దీంతో ఆమె ఏప్రిల్ 23వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనే ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. దాంతో ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. కాగా, నేడు కవితను కోర్టుకు తీసుకెళ్తుండగా…ఆమె ఎలాంటి ఆభరణాలు లేకుండానే కనిపించారు.కవితను జ్యుడిషియల్ కస్టడీకి అనుమతినిచ్చిన సమయంలో.. తనకు జైల్లో బంగారు ఆభరణాలను ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. తాజాగా కవిత కోర్టుకు హాజరు అయ్యే సమయంలో మాత్రం ఎలాంటి ఆభరణాలు లేకుండా కనిపించడంతో.. తీహార్ నిబంధనలు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి.. జైల్లో ఎలాంటి ఆభరణాలు ధరించేందుకు అనుమతించరు.కవిత పెట్టుకొన్న పలు విజ్ఞప్తులను కోర్టు పరిగణనలోకి తీసుకొని…ఇంటి భోజనంతోపాటు పడుకొనేందుకు మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు , బంగారు ఆభరణాలు ధరించేందుకు అనుమతి మంజూరు చేశారు. తాజాగా మంగళవారం కోర్టుకు వెళ్తుండగా కవిత విజయసంకేతం చూపిస్తూ కనిపించారు.. కాని ఆమె మెడలోనూ, చేతికి కానీ ఎలాంటి ఆభరణాలు కనిపించకపోవడంతో జైలు అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले