ఇంటింటి ప్రచారాలకు అనుమతి అవసరం లేదు* *జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్*

ఇంటింటి ప్రచారాలకు అనుమతి అవసరం లేదు* *జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్*

Share with
Views : 10
* శ్రీకాకుళం,: ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి అవసరం లేదని, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి ఆయా రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారం నిర్దేశిత వేళల్లో ఎప్పుడైనా చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 41వ వారపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నూతన నిబంధనల ప్రకారం ఇంటింటి ప్రచారాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి సమస్యలున్నా తమకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఇప్పటివరకు 972 వివిధ ఫిర్యాదులు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26వ తేదీన, ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ అని తెలిపారు. రాజకీయ పార్టీలు అనుమతుల కోసం సువిధ, ఎన్కోర్ యాప్ లలో దరఖాస్తు చేసుకోవచ్చని, అనుమతులను ఎలాంటి ఆలస్యం లేకుండా మంజూరు చేస్తున్నామన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని, 85 ఏళ్లు పైబడిన, వికలాంగులు, మంచానికే పరిమితమైన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని, ఇది తప్పనిసరి కాదని, మే 12వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ సౌకర్యంనకు వీరికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతి రావు, వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు రౌతు శంకరరావు (వైయస్సార్సీపీ), పిఎంజే. బాబు (టిడిపి), సురేష్ సింగ్ (బిజెపి), లాస సోమేశ్వరరావు (బి.ఎస్.పి), దేశళ్ళ గోవింద మల్లిబాబు (కాంగ్రెస్), రట్టి ప్రకాశరావు (సిపిఎం), ఎన్నికల‌ విభాగం అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले