రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదంటే ఇక సాధారణ ప్రజల రక్షణ సంగతేంటి? : వర్ల రామయ్య, దేవినేని ఉమ

రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదంటే ఇక సాధారణ ప్రజల రక్షణ సంగతేంటి? : వర్ల రామయ్య, దేవినేని ఉమ

Share with
Views : 14
*శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే పేర్ని నాని, కిట్టూల దెబ్బకు భయబ్రాంతులయ్యారు* *పోలీసు స్టేషన్‌పైనే వైకాపా నాయకులు దాడులు చేస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం మాకు లేదు* *తక్షణమే పేర్ని నాని, కిట్టూలపై కఠిన చర్యలు తీసుకొని ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలి* *పచ్చి గడ్డిని ఎండుగడ్డిలా చూపించే న్యూస్ ఛానెల్‌కు నిజాయితీగా వార్తలను ప్రసారాలు చేసే దమ్ము లేదు* *‘బుల్లెట్ రిపోర్టర్’ పేరుతో పెయిడ్ న్యూస్ ప్రసారం చేస్తూ తెలుగుదేశం పార్టీపై టీవి 9 ఛానెల్ అక్కసు వెల్లబోసుకుంటోంది* - *తెదెపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా* శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులకే వైకాపా నాయకుల నుండి రక్షణ లేకుండా పోయిందని మచిలీపట్నంలో పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టూలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెదెపా నేతలు పాల్గొన్నారు. *రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదంటే ఇక సాధారణ ప్రజల రక్షణ సంగతేంటి? : వర్ల రామయ్య* “మచిలీపట్నంలో మా వారిపై ఎందుకు ఎఫ్ఐఆర్ రాశారు అంటూ వైకాపా అభ్యర్ధి పేర్ని కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరూ కలిసి పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారులే పేర్ని నాని, కిట్టూల దెబ్బకు భయబ్రాంతులయ్యారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేస్తే తండ్రికొడుకులపై కేసు నమోదు చేసి, బొక్కలో తోయాల్సిందిపోయి వారిపై సెక్షన్ 341 కింద ఏదో చిన్న కేసు నమోదు చేశారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేయడం చూసి పాత్రికేయులే భయపడిపోతే చింతకాయ చెట్టుకు ఆకతాయితనంగా రాయివేసినట్లు ‘మిస్ చీఫ్’ అని టుమిరీ కేసు పెట్టారు. రేపు ఏదైనా పెద్ద లా&ఆర్డర్ సమస్య వస్తే పోలీసులు ఏమి సమన్యాయం చేస్తారు? ఇలాంటి అధికారులను చూస్తుంటే ఎన్నికలు సజావుగా సాగుతాయో లేదో అని ఆందోళనగా ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువేళ్ళాం. అసలు అక్కడ ఏం జరిగిందో డిజిపి దగ్గర నుంచి ఫ్యాక్ట్ రిపోర్ట్ తెప్పించి ఖచ్చితంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు” అని తెలియజేశారు. *చంద్రబాబుపై దుష్ప్రచారాలు చేయడమే పనిగా బ్లూ మీడియా పని చేస్తోంది....* “పచ్చి గడ్డిని ఎండుగడ్డిలా చూపించే ఓ ఛానెల్‌లో ఒక బుల్లెట్ వాహనంపై ఓ యువతిని కూర్చోపెట్టి చంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు హయాంలో రోడ్లు బాగా లేవంటూ కానీ జగన్ రెడ్డి పాలనలో అయితే రోడ్డు మీద పాలు పడితే ఏరుకోవచ్చంటూ నిసిగ్గుగా ఆరోపణలు ప్రసారం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి డబ్బులతో పెయిడ్ ఆర్టీస్టులు తమకిష్టమొచ్చినట్లు కూటమిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. రూపాయి తీసుకోకుండా నిజాయితాగా ప్రసారాలు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఆ ఛానల్‌కు లేదు. ప్రయాణికుల నడుములు ఇరిగేలా మన రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఉంటే చాలా చక్కని, చిక్కటి రోడ్లంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఈ దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోండని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆపండని తెదెపా కార్యకర్తలను బండబూతులు తిడుతూ వైసీపీ కార్యకర్తలా నెల్లూరు జిల్లాలోని ఒక డిఈ వ్యవహరించారు. ఎన్నికల ప్రచారానికి తీసుకున్న అనుమతుల అకౌంట్ లిస్ట్ మొత్తం నాకు చెప్పాలని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పాలకొల్లులోని ఒక ఆర్వో ఆదేశాలిచ్చారు. ఇలా ఈ అధికారి వ్యవహరిస్తున్నాడని సిఈవోకి తెలిపిన వెంటనే అతన్ని మందలించమని సంబంధిత కలెక్టర్‌కు ఫోన్ చేసి చెప్పారు” అని తెలిపారు. *రాష్ట్రంలో అసలు డిజిపి ఉన్నాడా! అని ప్రజలు అనుమానిస్తున్నారు...* “డిజిపిలాంటి అధికారులను పెట్టుకుంటే ఎన్నికలు సజావుగా సాగవని మేమునకుంటున్నాం. ఎన్నికల కోడ్ వచ్చి ఇన్ని రోజులవతున్నా నా నాయకత్వంలో శాంతిభద్రతలు కాపాడుతా, ఎన్నికలు సజావుగా నిర్వహిస్తా, ఒక్కరు తప్పు చేసినా ఊరుకోను, పేర్ని నానిలాంటి వారు పోలీసు స్టేషన్‌లపై దాడులు చేస్తే ఉపేక్షించను అని ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో ధైర్యం డిజిపి నింపలేదు. అసలు రాష్ట్రంలో డిజిపి ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. ఇటువంటి ఆరోపణలు డిజిపిపై తొలగాలంటే ప్రజల్లో నమ్మకాన్ని కల్పించుకోండి” అని వర్ల రామయ్య డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డిని కోరారు. *పెయిడ్ న్యూస్ నడుపుతూ తెదెపా ప్రభుత్వంపై టీవి 9 దుష్ప్రచారాలు : దేవినేని ఉమా* “టివి 9 ఛానల్ ప్రైమ్ టైమ్ లో బుల్లెట్ రిపోర్టు పేరుతో పెయిడ్ న్యూస్ నడుపుతున్నారు. దానికి మీడియా కమిటీ నుండి అనుమతి తీసుకొనవలసి ఉన్నా, తీసుకోకుండా కోడ్‌ను ఉల్లంఘించి దుష్ప్రచారాలు చేస్తున్నారు. తెదెపా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా దురుద్దేశ్యపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ రెండింటిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు గాను టివి 9 యాజమాన్యంపై ఎన్నికల కమిషన్ కేసును నమోదు చేసి దుష్ప్రచారాలు చేస్తున్నందుకు చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం” అని దేవినేని ఉమా తెలియజేశారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో కృష్ణయ్య రిటైర్డ్ IAS, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెదెపా రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వినర్ బుచ్చి రాంప్రసాద్, టీడీఎల్పీ కోనేరు సురేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, హెచ్ఆర్డి మెంబర్ ఎస్పీ సాహెబ్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले