తప్పుటడుగు వేసి భవిష్యత్ నాశనం చేసుకున్న మహేష్

తప్పుటడుగు వేసి భవిష్యత్ నాశనం చేసుకున్న మహేష్

Share with
Views : 14
పవన్ కల్యాణ్‌ను వైసీపీ భాషలో విమర్శిస్తూ వ్యక్తిత్వాన్ని కించ పరుస్తున్న పోతిన మహేష్ వ్యవహారం జనసేనలోనే కాదు ఇతర పార్టీల్లోనూ చర్చనీాయంశమవుతోంది. ఆయన తన రాజకీయ భవిష్యత్ ను పవన్ నాశనం చేశాడని అంటున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలనే రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. మరి పవన్ అవకాశం కల్పించలేదా ? అవకాశం కల్పించినప్పుడు ఏం చేశారు ? జనసేన బలం ప్రకారం ఓట్లు పొందలేని ఆయన నాయకుడేనా ? పార్టీ బలానికి సొంత బలం కొంత జమ చేస్తేనే లీడర్ పార్టీ బలం మీద ఆధారపడి గెలిచేవాడు ఎప్పటికీ లీడర్ కాలేడు. పార్టీ బలానికి తోడు తన బలం తోడు చేసి విజయాలు సాదించేవారే లీడర్ అవుతారు. తాను జనసేన పార్టీని బలోపేతం చేశానని చెప్పకుంటున్న పోతిన మహేష్ కనీసం పార్టీ బలాన్ని కూడా తనకు ఓట్లుగా మల్చుకోలేని నేత. ఈ విషయం రికార్డుల పరంగా వెల్లడి అవుతోంది. ఆయనకు సొంత పార్టీలోనే పూర్తి స్థాయి మద్దతు లేదని పార్టీకి మైనస్ అయ్యారని లెక్కలు చెబుతున్నాయి. పీఆర్పీ గెలిచిన స్థానంలో డిపాజిట్ తెచ్చుకోలేని పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. ఎవరితోనూ పొత్తుల్లేకుండా గెలిచింది. ముక్కోణపు పోటీలో 35 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఎనిమిది వేల మెజార్టీతో ఈ పోతిన మహేష్ ఐదేళ్లపాటు ఎవరి మీద అయితే తీవ్ర ఆరోపణలు చేశారో వెల్లంపల్లి శ్రీనివాసే పీఆర్పీ తరపున గెలిచారు. అలాంటి స్థానంలో జనసేన నాయకుడిగా పోతిన మహేష్‌ను పవన్ కల్యాణ్ ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుతో పోటీ చేసినప్పటికీ ఆయనకు వచ్చిన ఓట్లు 14 శాతమే. డిపాజిట్ కూడా రాలేదు. మరి ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా నిలిచిన వారందరూ.. జనసేన అభ్యర్థి పోతిన మహేష్‌కు ఎందుకు ఓటు వేయలేదు ? పోతిన మహేష్‌కు విజయవాడ వెస్ట్‌లో వ్యతిరేకత ! పోతిన మహేష్ బీసీ వర్గానికి చెందిన నేత. నిజానికి ఆయనకు ఆ వర్గాలన్నీ మద్దతివ్వాలి. జనసేన పార్టీకి సహజంగానే మైనార్టీల మద్దతు ఉంటుంది. వారిలో కొంత భాగం ఓట్లు తెచ్చుకున్నా పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సులువుగా గెలిచి ఉండే నేత. కానీ ఆయన వ్యక్తిగత వ్యవహారాలు, నోటి దురుసు వల్ల ప్రజలు ఆయనపై వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన తీరు వల్ల జనసేన పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు. తాను తప్ప మరో నేత జనసేన తరపున ఉండకూడదన్నట్లుగా వ్యవహరించేవారు. ఫలితంగా జనసేన పార్టీ నష్టపోయింది. పొత్తులుంటే బీజేపీకి కేటాయింపు – గెలిచే చాన్స్ టీడీపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నా మిత్రపక్షానికి విజయవాడ పశ్చిమ సీటు కేటాయిస్తూ వస్తోంది. గతంలో బీజేపీకి కేటాయించింది. 2014లో అతి స్వల్ప తేడాతోనే బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు ఆ సీటును బీజేపీకి కేటాయించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. పవన్ కల్యాణ్ పోతిన మహేష్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నప్పటికీ.. నగరాలు వంటి బీసీ వర్గానికి చెందిన నేత ఎదగాలన్న ఉద్దేశంతో అవకాశాలు కల్పించారు. కానీ ఇప్పుడు ఆయన పవన్ మీదనే విషం చిమ్మి వైసీపీలో చేరిపోయారు. రాజకీయ భవిష్యత్ పోగొట్టుకున్న పోతిన మహేష్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత చాలా మంది యువనేతలు తెరపైకి వచ్చారు. వారిలో కొంత మంది నిలబడ్డారు. మరికొందరు భవిష్యత్‌ నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భవిష్యత్‌లో జనసేన కీలక నేతలుగా ఉంటారని ప్రచారంలోకి వచ్చే వారిలో కిరణ్ రాయల్, పంచకర్ల సందీప్, పోతిన మహేష్ వంటి వారి పేర్లు ఎక్కవగా ప్రచారంలోకి వస్తాయి. వీరిలో పోతిన మహేష్ ఇప్పుడు అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ నాయకులంతా ఘోరంగా విమర్శిస్తూ పార్టీని వీడిపోయారు. వైసీపీలో చేరిపోయారు. రాజకీయంగా ఆయన క్రెడిబులిటీ పూర్తిగా దెబ్బతిన్నది. ఆయనకు ఇప్పుడు టిక్కెట్ ఇస్తారో లేదో తెలియదు. కానీ.. ఎన్నికల తర్వాత పోతిన మహేష్ ఫేడవుట్ అయిపోతారు. వాయిస్ ఉన్న బీసీ నేత తప్పటడుగు వేసి రాజకీయ భవిష్యత్ ను అంధకారం చేసుకున్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले