పురంధరేశ్వరి పిర్యాదు పై ఎన్నికల కమిషన్ నివేదిక

పురంధరేశ్వరి పిర్యాదు పై ఎన్నికల కమిషన్ నివేదిక

Share with
Views : 12
ఏపీలో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు, వారి నిర్వాకాలపై పురందేశ్వరి చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరింది. సీఎస్ జవహర్ రెడ్డి తీరుపైనా పురందేశ్వరి ఫిర్యాదు చేసింది. వారిపై ఇతర పార్టీల నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వారిపై నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. సీఈవో మీనా ఇచ్చే నివేదిక ప్రకారం.. . చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీరిలో అత్యధికులు ట్రాన్స్ ఫర్ అవడం ఖాయమని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి.. ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ప్రయత్నం చేశారు. మద్యం పేరుతో ఓ తప్పుడు కేసు పెట్టి… అందులో సీఈవో మీనాను ఇరికిస్తామని బెదిరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన లీడర్ల ఫోన్లను యథేచ్చగా ట్యాపింగ్ చేస్తున్నారు. మరో ఎస్పీ రిషాంత్ రెడ్డితో కలిసి ఆయన ఈ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర అధికారుల గురించి చెప్పాల్సిన పని లేదు. వారంతా జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులుగా గుర్తింపు పొందాలు. ఎన్నికల నామినేషన్ల గడువు ప్రారంభమయ్యే సరికి వైసీపీ కోసం పని చేసే అధికారులందర్నీ సాగనంపేలా చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంచార్జ్ డీజీపీ నేతృత్వలో ఎన్నికలు జరిగేందుకు ఈసీ అంగీకరించకపోవచ్చునని చెబుతున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి… పెన్షన్ల విషయంలో 33 మంది వృద్ధుల మరణానికి కారణం అయ్యారు. వీటన్నింటినీ చూస్తే.. జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులందరికీ ట్రాన్స్ ఫర్ టైం దగ్గర పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది .
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले