భూదేవి ఆత్మీయ సమావేశం

భూదేవి ఆత్మీయ సమావేశం

Share with
Views : 16
~ ప్రకటించిన అభ్యర్థిని మార్చకపోతే భవిష్యత్తుపై నిర్ణయం ~ పడాల భూదేవితో సమావేశమైన నాలుగు మండలాల టిడిపి క్యాడర్ పాలకొండ నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాల టిడిపి కార్యకర్తలు, పడాల భూదేవి అభిమానులు గురువారం పాలకొండలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు పడాల భూదేవితో సమావేశం అయ్యారు. నాలుగు మండలాల నుండి వచ్చిన మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ప్రస్తుత సర్పంచులు, మాజీ సర్పంచ్ లు, పార్టీ కార్యకర్తలు పడాల భూదేవితో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి, అనంతరం మీడియాని ఉద్దేశించి పడాల భూదేవి మాట్లాడుతూ.... జనసేన పార్టీ అధ్యక్షులు, తమ నాయకులు పవన్ కళ్యాణ్ గారిపై తమకు ఇంకా నమ్మకం ఉందని అన్నారు. టిడిపి, జనసేన పార్టీల క్యాడర్ తనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని, తనకిచ్చిన మాటని అన్న పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుని తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి తనకు న్యాయం చేయాలని పడాల భూదేవి కోరారు. మాజీ జెడ్పిటిసి సామంతుల దామోదరరావు మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాలకొండకి ప్రకటించిన అభ్యర్థిని మార్చి, పడాల భూదేవిని అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. పాలకొండలో జనసేన జెండా ఎగరాలంటే, పడాల భూదేవి అభ్యర్థిత్వంతోనే సాధ్యమని అన్నారు తాను నియోజకవర్గంలో ఎనిమిది సార్లు జనరల్ పోలింగ్ ఏజెంట్ గా పని చేసిన అనుభవంతో చెబుతున్నానని సామంతుల దామోదరరావు తెలిపారు. మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ ఖండాపు జ్యోతి, సీనియర్ టిడిపి నాయకులు ఖండాపు వెంకట రమణమూర్తిలు మాట్లాడుతూ, గత నెల 27న పార్టీలో పడాల భూదేవిని జాయిన్ చేసుకుని అభ్యర్థి గా ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారని తెలిపారు. ఈనెల 7న అనకాపల్లిలో పడాల భూదేవి ని పార్టీలో జాయిన్ చేసుకున్నారని అన్నారు. పడాలి భూదేవిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో, ఆమెను కాదని జయకృష్ణను ప్రకటించడం అన్యాయమని రమణమూర్తి పేర్కొన్నారు మండల మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ సి.ఎల్. నాయుడు మాట్లాడుతూ, పడాల భూదేవిని అభ్యర్థిగా ప్రకటించకుండా వేరే వారిని ప్రకటించడంపై నియోజకవర్గంలో నాలుగు మండలాల టిడిపి, జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కార్యకర్తలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా పునః పరిశీలించి పడాలి భూదేవిని అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. పాలకొండ మాజీ ఎంపీపీ వారాడ సుమంత్ నాయుడు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పడాల భూదేవి ప్రత్యర్థికి ధీటైన అభ్యర్థి అని, పడాల భూదేవిని అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే సీటు ఖాయం అని చెప్పారు. సీతంపేట ఏజెన్సీ ప్రాంతానికి చెందిన చర్చి ఫాదర్ జాన్ ఫాదర్ మాట్లాడుతూ, పడాల భూదేవి అన్ని రకాలుగా ధీటైన ప్రత్యర్థి అని తెలిపారు. నారీ శక్తి రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా తనని తాను నిరూపించుకున్న పడాల భూదేవి మహిళా శక్తికి నిదర్శమని జాన్ ఫాదర్ కొనియాడారు. సీతంపేట మండలం కోతం గ్రామ సర్పంచ్ గంగయ్య మాట్లాడుతూ, జయకృష్ణని మార్చకపోతే, నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడం ఖాయమని, జయకృష్ణకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు సీతంపేట మాజీ ఎంపీపీ సవర కుంపి, జంపు చంద్రశేఖర్, బుల్లిబాబు, గుమ్మడి సింహాద్రి, పైల సత్యం నాయుడు, నడిమికెళ్ల సర్పంచ్ ఎం.వి.రమణ, కరణం లక్మునాయుడు తదితరులు మాట్లాడారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले