కుప్పం బాటలో యువనేత నారా లోకేష్ తరపున నామినేషన్*

కుప్పం బాటలో యువనేత నారా లోకేష్ తరపున నామినేషన్*

Share with
Views : 10
*కుప్పం బాటలో రేపు యువనేత నారా లోకేష్ తరపున నామినేషన్* *టిడిపి-జనసేన-బిజెపి ముఖ్యనేతల చేతులమీదుగా 2సెట్ల నామినేషన్లు* *రేపు ఉదయం 9.30 గంటలకు సర్వమత ప్రార్థనలతో ప్రారంభం కానున్న ర్యాలీ* అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం తరహాలో మంగళగిరిలో యువనేత నారా లోకేష్ తరపున స్థానిక నేతలే నామినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశల వారధి, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి, యువనేత లోకేష్ తరపున వేలాది ప్రజల సమక్షంలో కూటమికి చెందిన ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీ నేతలు గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద సర్వమత ప్రార్థనలతో కూటమి కార్యకర్తలు, అభిమానుల నడుమ భారీ ర్యాలీగా ర్యాలీగా కూటమినేతలు బయలుదేరతారు. మంగళగిరి టిడిపి సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపి, జనసేన, బీజేపి కి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతల చేతుల మీదుగా మధ్యాహ్నం 2. 34 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. లోకేష్ నామినేషన్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలుత మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో యువనేత నామినేషన్ పత్రాలతో కూటమినేతలు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం సీతారామ కోవెల నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ... మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటుంది. కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరపున కూటమి నేతలు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో నియోజకవర్గం నలుమూలల నుంచి 10వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. ******
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले