కాపులంటే అంత కక్ష్య ఎందుకు జగన్ రెడ్డి? : నిమ్మల రామానాయుడు

కాపులంటే అంత కక్ష్య ఎందుకు జగన్ రెడ్డి? : నిమ్మల రామానాయుడు

Share with
Views : 14
కాపులంటే అంత కక్ష్య ఎందుకు జగన్ రెడ్డి? : నిమ్మల రామానాయుడు గులక రాయి కేసులో బోండా ఉమాను ఇరికించే కుట్రలు మానుకోవాలి -చిన రాజప్ప, నిమ్మల రామానాయుడు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాపులను రాజకీయంగా,ఆర్దికంగా, సామాజికంగా అణచివేస్తూ అక్రమ కేసులతో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాపులంటే జగన్ రెడ్డికి అంత కక్ష్య ఎందుకు? గులకరాయి కేసులో బోండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నారు. గులకరాయి డ్రామా అడ్డం తిరగడంతో బీసీలు, కాపుల్ని బలిపశువుల్ని చేసే కుట్రకు జగన్ రెడ్డి తెరతీశారు. రాయి విసిరారంటూ అమాయకులైన బీసీ యువకుల్ని అదుపులోకి తీసుకుని 3 రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ ఘటనకు కాపు నేత బోండా ఉమాను భాద్యునిగా చేస్తూ అక్రమ కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు గులకరాయి ఘటనకు బోండా ఉమాకు సంబందం ఏంటి? సానుభూతి కోసం డ్రామాలాడారు, ప్రజలకు తెలిసిపోయాక ప్రతిపక్ష నేతలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బోండా ఉమాపై అక్రమ కేసు పెట్టేందుకు యత్నించటం అంటే కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.వైసీపీ వైఫల్యాలు,అరాచకాల్ని బోండా ఉమా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారనే జగన్ కక్ష్య సాధిస్తున్నారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా కాపులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. లేకుంటే కాపుల కసి తీరేలా వైసీపీని చిత్తు చిత్తుగా ఒడిస్తారని నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ శాసనసభ్యులు అన్నారు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले