జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులు,సిబ్బంది సితరాముల వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలి.:

జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులు,సిబ్బంది సితరాముల వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలి.:

Share with
Views : 16
*జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ* * జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులు,సిబ్బంది సితరాముల వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలి. * జిల్లా ఎస్పీ శ్రీమతి జి.అర్.రాధిక. శ్రీకాకుళం : శ్రీరామ నవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఎచ్చెర్ల శ్రీరామ మందిరంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.ఈ కళ్యాణోత్సవం లో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక దంపతులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా ఎస్పీ దంపతుల చేతుల మీదుగా ఆలయ అర్చకులు సీతారాముల కల్యాణం వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో పోలీసు అధికారులు,సిబ్బంది కుటంబ సభ్యులు,ఎచ్చెర్ల గ్రామ పురజన భక్తులు కళ్యాణోత్సవం, పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.ధర్మం,సత్యం సిద్ధాంతాలను శ్రీరాముడు ఆచరించి మార్గదర్శకంగా నిలిచిన శ్రీరామ నవమి పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం ఎచ్చెర్ల పోలీసు కమ్యూనిటీ హాలు లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దంపతలు ప్రారంభించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వడ్డన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి. ప్రేమ్ కాజల్, వి.ఉమా మహేశ్వర రావు, డిఎస్పీలు వై శ్రుతి,ఎల్. శేషాద్రి నాయడు,విజయ కుమార్, శ్రీనివాసరావు, ఆర్ఐలు, సిఐ,ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले