సునీత ఇచ్చిన సలహాపై అవినాష్ రెడ్డి స్పందించడం కూడా కష్టమే

సునీత ఇచ్చిన సలహాపై అవినాష్ రెడ్డి స్పందించడం కూడా కష్టమే

Share with
Views : 12
వైఎస్ వివేకానందరెడ్డిపై తమకు ఎంతో ప్రేమ ఉందని ఆయనను తాము ఎందుకు చంపుకుంటామన్నట్లుగా ప్రకటనలు చేస్తూ.. ఇప్పటికీ అమాయకంగా నటిస్తున్న అవినాష్ రెడ్డికి సునీత ..షాక్ ఇచ్చారు. అదే నిజం అయితే.. వివేకా చివరి కోరికను తీర్చాలన్నారు. ఆ చాన్స్ అవినాష్ రెడ్డి చేతుల్లో ఉందన్నారు. వివేకా చివరి కోరిక షర్మిల ఎంపీగా వెళ్లడమని.. అవినాష్ రెడ్డి పోటీ నుంచి వైదొలిగి షర్మిలకు మద్దతు ప్రకటించాలన్నారు. అవినాష్ రెడ్డికి వద్దని షర్మిలకే ఎంపీ సీటు ఇవ్వాలని వైఎస్ ఫ్యామిలీలో జరిగిన రాజకీయంలోనే హత్య జరిగిందని సీబీఐ చెబుతోంది. షర్మిలకు కూడా అదే చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన షర్మిలకు చిన్న పదవి ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించలేదు. పూర్తిగా దూరం పెట్టారు. ఇక ఎంపీ పదవి అనే ఆలోచనే చేయలేదు. ఎక్కడో గుజరాత్ కు చెందిన వారికి.. తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. కానీ షర్మిల ను పట్టించుకోలేదు. చివరికి ఆస్తి కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు షర్మిల కోసం అవినాష్ రెడ్డి పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదు. సునీత ఇచ్చిన సలహాపై అవినాష్ రెడ్డి స్పందించడం కూడా కష్టమే. సునీత స్పష్టమైన సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టి జస్టిస్ ఫర్ వివేకా పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి కౌంటర్ ఇవ్వడానికి అవినాష్ రెడ్డి విచిత్రమైన వాదనలతో తెరపైకి వస్తున్నారు. ఆధారాలు కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. విచారణ సీబీఐ సరిగ్గా చేయడంలేదని పాత వాదనే వినిపిస్తున్నాయి. కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలతో .. అసలు అవినాష్ రెడ్డి ఇంకా ఎలా బయట ఉన్నారన్న విస్మయం .. న్యాయనిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. తండ్రిని జైల్లో ఉంచి.. అవినాష్ రెడ్డి మాత్రం సేఫ్ గా బయట తిరుగుతున్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले