ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడి కేసులో నిందితుడు అరెస్ట్.*

ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడి కేసులో నిందితుడు అరెస్ట్.*

Share with
Views : 10
*గౌరవ ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడి కేసులో నిందితుడు అరెస్ట్.* *నిందితునికి 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం.* ది.13.04.2024 వ తేదిన విజయవాడ అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ స్టేడియం వద్ద గల వివేకానంద పాఠశాల సమీపంలో “మేమంతా సిద్దం” రోడ్ షో లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు గౌరవ శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిన సంగతి విదితమే. సదరు సంఘటనపై పశ్చిమ నియోజికవర్గ ఎం.ఎల్.ఏ. శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అజిత్ సింగ్ నగర్ పోలీసు స్టేషన్ నందు 307 IPC సెక్షన్ క్రింద కేసును నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా గారు, డి.సి.పి. గారి నేతృత్వంలో ఇద్దరు అడిషనల్ డి.సి.పి.లతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును కొనసాగించినారు. ఈ బృందాలు సి.సి.టి.వి.ఫూటేజ్, సెల్ ఫోన్ రికార్డింగ్ అనాలసిస్, అనుమానితుల విచారణ, టవర్ డంప్ అనాలసిస్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్ మెంట్స్ రికార్డింగ్ చేసినారు. క్లూస్ టీం బృందాలు మరియు నిఘా బృందాలు సేకరించిన ఆధారాలు ఆధారంగాను మరియు సుమారు 50 సి.సి.టి.వి.ఫూటేజ్ లను విశ్లేషించడం జరిగింది. సుమారు 100 మంది అనుమానితులను మరియు ప్రత్యక్ష సాక్షులను సమగ్రంగా విచారించి అతితక్కువ సమయంలో సంచలనాత్మకమైన కేసును చేదించడం జరిగింది. సంఘటనా స్థలంలో గల సి.సి.ఫూటేజ్ లు మరియు ప్రత్యక్ష సాక్షుల చెప్పిన విలువైన సమాచారం ఆధారంగా దీనిలో నిందితుడుగా గుర్తింపబడిన వేముల సతీష్ కుమార్ @ సత్తి (18 సం.), S/o. దుర్గారావు, వడ్డెర కాలని, అజిత్ సింగ్ నగర్ అనే అతను అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని వడ్డెర కాలని నందు నివసిస్తూ భవననిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనిని అదుపులోనికి తీసుకుని విచారించగా సి.ఎం.గారి రోడ్ షో జరుగుతున్న రోజు వేముల సతీష్ కుమార్ వివేకానంద పాఠశాల వద్దకు వచ్చి అక్కడ కాంక్రీట్ రాయితో సి.ఎం.గారిపై దాడి చేయడం జరిగింది. ప్రత్యక్షసాక్షులు పోలీసులకు అందించిన విలువైన సమాచారం మేరకు మరియు సి.సి.ఫూటేజ్ లలోని రికార్డింగ్స్ ఆధారంగా చేసుకుని నిందితుడుని అదుపులోనికి తీసుకుని సంచాలనాత్మకమైన కేసును చేధించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసిన వేముల సతీష్ కుమార్ ను అరెస్ట్ చేసి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానం నందు ప్రవేశ పెట్టగా గౌరవ జడ్జ్ గారు నిందితునికి 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले