ఈ వైసీపీ అవసరమా ? : వై యస్ . షర్మిల

ఈ వైసీపీ అవసరమా ? : వై యస్ . షర్మిల

Share with
Views : 24
శింగనమల : ఇదే శింగనమల నియోజక వర్గానికి జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. హార్టికల్చర్ కి పెద్ద పీట వేస్తామని మోసం చేశారు. పంట స్థిరీకరణ నిది అని మోసం చేశారు. పరిశ్రమలు ఇస్తామని హామీ ఇచ్చాడు. నియోజక వర్గంలో మారు మూల గ్రామానికి సాగునీరు ఇస్తామని చెప్పాడు.లెదర్ పార్క్ తెరిపిస్తా అని మోసం చేశాడు. ఒక్క హామీ నెరవేరలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని ఈ వైసీపీ అవసరమా ? మళ్ళీ మోసం చేయడానికి వీళ్లకు అధికారం ఇవ్వాలా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఏవి అమలు కాలే.మద్యపాన నిషేధం అని అమలు చేశారా ? నిషేధం పక్కన పెడితే ప్రభుత్వమే భూమిలు అమ్ముతున్నారు. విచ్చలవిడిగా కల్తీ మద్యం. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. బటన్ నొక్కుతున్నారు అని చెప్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి ..ఒక చేత్తో గుంజుకుంటున్నారు . రేట్లు భారీగా పెంచి ఇచ్చింది దోచుకుంటున్నారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి..మరో చేత్తో వెండి చెంబు గుంజుకుంటున్నారు ఇది వైఎస్ఆర్ పాలన కాదు. వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లో లేడు వై అంటే వైవీ సుబ్బారెడ్డి..ఎస్ అంటే సాయి రెడ్డి.. ఆర్ అంటే రామకృష్ణ సజ్జల. సాక్షి టీవీ లో సైతం వైఎస్ఆర్ ఫోటో ను మాయం చేశారు. పథకాల్లో వైఎస్ఆర్ ఫోటో తీసేస్తున్నారు రాష్ట్రానికి పత్యేక హోదా సంజీవని. హోదా అనే అంశాన్ని కనుమరుగు చేశారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. పోలవరం కట్టి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యి ఉండేది. రాష్ట్రం అభివృద్ది కావాలి అంతే కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలో రావాల్సి ఉంది. కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రం జాతకం మారిపోతుంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले