*ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి* *ఏడు రోడ్ల కూడలిలో ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్*

*ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి* *ఏడు రోడ్ల కూడలిలో ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్*

Share with
Views : 5
*ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి* *ఏడు రోడ్ల కూడలిలో ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్* శ్రీకాకుళం,: సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సామూన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. అక్కడే విద్యార్థులు, జిల్లా అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని, 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వం అని, మహిళలు, వికలాంగులు, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మారుమూల గ్రామాల్లో, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతం మరింత పెరగాలని, ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరిలో ఓటు హక్కు పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ స్వీప్ కార్యక్రమంలో అంబేద్కర్ యూనివర్సిటీ, వెంకటేశ్వర, శివాని ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య, ప్రతిభ, సన్ డిగ్రీ కళాశాలల, ప్రభుత్వ పురుషుల కళాశాల, మహిళా కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్.సి.సి విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యత వివరిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. చెన్నకేశవ రావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని గడ్డమ్మ, ముఖ్య ప్రణాళిక అధికారిని ప్రసన్నలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతి రావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले