వైసిపి ప్రలోభాలకు గురి కావద్దు: నారా భువనేశ్వరి

వైసిపి ప్రలోభాలకు గురి కావద్దు: నారా భువనేశ్వరి

Share with
Views : 11
*నారా భువనేశ్వరి గారి స్పీచ్:-* • తెలుగుదేశంపార్టీ బిడ్డలందరికీ నా నమస్కారాలు... • రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరేయాలని అనేదే మన అజెండా కావాలి. • చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన సమయంలో నేను చేసిన నిజం గెలవాలి కార్యక్రమంలో నాకు రాష్ట్రమంతా బ్రహ్మరథం పట్టారు...దానికి కారణం చంద్రబాబుపై పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానం, గౌరవం. • చంద్రబాబు, లోకేష్, నన్ను టీడీపీ కార్యకర్తలు ఆదరిస్తున్న తీరును మేం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. • కుటుంబంలో భిన్నాభిప్రాయాలుంటాయి...కానీ కుటుంబాన్ని ముందుకు నడపడంలో అందరూ ఏకమవుతారు. • రానున్న ఎన్నికల్లో కుప్పం కుటుంబ సభ్యులంతా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఒక్కటై పనిచేయాలని కోరుతున్నాను. • నేను టీడీపీ కార్యకర్తల్లో ఒక కార్యకర్తలా, రాష్ట్ర మహిళల్లో ఒక మహిళగా టీడీపీ ప్రభుత్వాన్ని తెచ్చేందుకు నావంతుగా మే 10వరకు ఎన్నికల ప్రచారం చేస్తాను. • రానున్న ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కుప్పం అభివృద్ధికి 20పాయింట్లతో కూడిన ప్రత్యేకమైన మ్యానిఫెస్టోను తయారు చేశారు...ముఖ్యమంత్రి అయిన వెంటనే కుప్పం ప్రజలకు ఆ 20అంశాలను అమలు చేసి తన నిజాయితీని నిరూపించుకుంటారు. • చంద్రబాబు గత 7దఫాలుగా ఎమ్మెల్యే అవుతున్నారంటే..కుప్పం ప్రజలు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం...కుప్పం ప్రజల పట్ల చంద్రబాబు తీసుకుంటున్న శ్రద్ధ కారణం. • రానున్న కాలంలో కూడా కుప్పం నియోజకవర్గానికి ప్రతి రెండు,మూడు నెలలకు ఒకసారి వచ్చి, మీతో కలుసుకుంటాను...మీ సమస్యలపై ఆరా తీస్తాను. • రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను గ్రామాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరవేయాలి...సూపర్ సిక్స్ పథకాలపై మరింత అవగాహన కల్పించాలి. • చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ప్రయోజనం ఏంటి? అనేది పార్టీ కార్యకర్తలంతా మారుమూల గ్రామాలకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాలపై విస్తృతమైన ప్రచారం నిర్వహించాలి...ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోవాలి. • రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వంలో ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్నారు. • చంద్రబాబు కార్యకర్తలకు ఇబ్బందులు వస్తే అర్ధరాత్రి కూడా శ్రమించి కార్యకర్తల ఇబ్బందులను పరిష్కరిస్తారు. • చంద్రబాబు కుటుంబంతో కంటే రాష్ట్ర ప్రజలతోనే ఎక్కువ సమయాన్ని గడిపారు. అందుకే చంద్రబాబుకు కుటుంబం కంటే రాష్ట్ర ప్రజలంటేనే ఎక్కువ ఇష్టం. • చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి...కుప్పం అభివృద్ధి చెందాలి. • ఎన్నికల సమయంలో అవకతవకలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. • వైసీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా...ఎవరూ లొంగవద్దు..మీ జీవితాలను బలిపెట్టొద్దు. • టీడీపీలో దక్కిన గౌరవం...వైసీపీలో దక్కదు...వైసీపీ లో నాయకులకు అవమానాలే తప్ప ఏమీ లేదు. • టీడీపీ కార్యకర్తలంతా భిన్నాభిప్రాయాలను ప్రక్కనపెట్టి...రాష్ట్రాభివృద్ధి కోసం పసుపుజెండాను రానున్న ఎన్నికల్లో ఎగరేయడానికి కంకణబద్దులు కావాలని నా మనవి. • చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో 53రోజులు మా కుటుంబంపై చూపిన ప్రేమ, అభిమానాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను...మీ అందరికీ నా పాదాభివందనాలు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले