తెదేపా అభ్యర్థులకు బి- ఫారాలు అందించిన చంద్రబాబు

తెదేపా అభ్యర్థులకు బి- ఫారాలు అందించిన చంద్రబాబు

Share with
Views : 11
*అమరావతి*తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు బి.ఫాంలు అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బి. ఫాంలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు..అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టి అభ్యర్ధులకు బిఫాంలు అందించారు. *తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిజ్ఞ* తెలుగుదేశం పార్టీ.....................శాసనసభ / పార్లమెంటు అభ్యర్ధిగా ఎంపికైన..............అను నేను పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు, నిర్ణయాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, పార్టీకి విధేయతతో...ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. • నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా నీతి, నిజాయితీతో, నిరాడంబరంగా ప్రజా సేవకు అంకితమౌతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో, కుల, మత వర్ణాలకు అతీతంగా సర్వవర్గ సంక్షేమానికి, ఆదర్శవంతమైన సమాజం కొరకు కృషి చేస్తాను. ప్రజా తీర్పు ద్వారా నాకు సంక్రమించే పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించి, దేశ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను. • స్వర్గీయ శ్రీ ఎన్.టి.రామారావు గారి ఆశయ సాధనకు పాటుపడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తాను. నేడు విధ్వంసమైన మన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడంలో భాగస్వామిని అవుతాను. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తాను. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా మనసా, వాచా, కర్మేణా కృషి చేస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని ప్రతిజ్ఞ చేయించారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले