ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించరాదు*: మనజిర్ జిలానీ

ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించరాదు*: మనజిర్ జిలానీ

Share with
Views : 4
*ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించరాదు* *స్వేచ్ఛగా, సజావుగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యం* *జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్* వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 21: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, హింసకు తావు లేకుండా, ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్‌.. నో రీపోల్‌), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్ అన్నారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వజ్రపు కొత్తూరు మండలం పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కమీషన్ సూచనల ప్రకారం ఏర్పాట్ల విషయమై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం నగరంపల్లి కూడలి వద్ద ఎఫ్ ఎస్ టి బృందం చేపడుతున్న పనులపై ఆరా తీశారు. పర్యటనలో పలాస నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి భరత్ నాయక్ , తహసిల్దార్, సిబ్బంది, పోలీస్ అధికారులు కలెక్టర్ పర్యటనకు హాజరయ్యారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले