ఆంధ్రప్రదేశ్ లో బదిలీలు సురు

ఆంధ్రప్రదేశ్ లో బదిలీలు సురు

Share with
Views : 13
ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం చేసింది. విజయవాడలో జగన్ పై రాయి దాడి ఘటనలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు బలంగా వచ్చాయి. రాయి దాడి జరిగిందో లేదో స్పష్టత లేకపోయినా హత్యాయత్నం పేరుతో కేసు పెట్టి.. టీడీపీ నేత బొండా ఉమను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బొండా ఉమను అరెస్టు చేసేందుకు వందల మంది పోలీసుల్ని కూడా పంపారు. అయితే ఏం జరిగిందో కానీ వెనక్కి తగ్గారు. దుర్గారావు అనే వ్యక్తిని కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆయనపై బదిలీ వేటు పడింది. కాంతిరాణా టాటా ఐపీసీని కాకుండా జగన్ లాను అమలు చేశారన్న ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రాజకీయ కుట్రలోనూ ఆయన భాగమవుతారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. గులకరాయి దాడి లో కూడా ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన మరో ఐపీఎస్ అధికారి రిషాంత్ రెడ్డితో కలిసి ట్యాపింగ్ చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సీతారామాంజనేయులును కూడా బదిలీ చేయడంతో సంచలనంగా మారింది. ఇక సీఎస్ పైనా అనేక ఆరోపణలు వస్తున్నాయి. డీజీపీని కూడా తప్పించాలని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. వీటిపై ఈసీ స్పందించాల్సి ఉంది.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले