నిజాయితీగా పవన్ కళ్యాణ్ అఫిడవిట్

నిజాయితీగా పవన్ కళ్యాణ్ అఫిడవిట్

Share with
Views : 11
సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తుల విలువ ఎంత‌? ఎన్ని అప్పులున్నాయో ఎన్నిక‌ల సంఘానికి అఫిడ‌విట్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త ఐదేళ్ల సంపాద‌న 114.76కోట్లు. ఇందులో 73.92కోట్లు ప్ర‌భుత్వానికి ఆదాయ ప‌న్ను, జీఎస్టీ క‌లిపి 73.92కోట్లు చెల్లించారు. ఇక ప‌వ‌న్ కు 64.26కోట్ల అప్పులున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులు 17.56కోట్లుండ‌గా, ఇత‌ర వ్య‌క్తుల నుండి 46.70కోట్ల పైచిలుకు తీసుకున్నారు. ఇక జ‌న‌సేన అధినేత ఈ 5 సంవ‌త్స‌రాల్లో 20కోట్ల‌కు పైగా విరాళాలు ఇచ్చారు. జ‌న‌సేన పార్టీకి 17.15కోట్లతో పాటు కౌలు రౌతుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల ప్ర‌మాద భీమా కూడా ఉన్నాయి. వీటితో పాటు కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి, పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ కు కోటి, ఏసీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50ల‌క్ష‌లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50ల‌క్ష‌లు ఇచ్చారు. ఇక అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కు 30,11,717రూపాయ‌లు ఇచ్చారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले