*పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

*పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

Share with
Views : 6
*పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ* *మే నెల 1వ తేదీన పెన్షన్ల ఇంటింటి పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని లేఖ* *గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబు* *గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే పెన్షన్ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరుతూ లేఖ రాసిన చంద్రబాబు* *లేఖలోని అంశాలు :-* • రాష్ట్రంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలి. • ప్రజాప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. • వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ జరుగుతుందని గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. • గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పెన్షన్ అందించడం సాధ్యమవుతుందని సీఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు ఇదివరకే తెలిపారు. • లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించాలని గతంలో మేము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టింది. • గత నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము 1వ తేదీన రావాల్సి ఉన్నా...3వ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. • పింఛన్ల కోసం 3 రోజుల పాటు సచివాలయాల చుట్టూ తిరిగి ఎండదెబ్బకు 33 మంది వృద్ధులు మృతి చెందారు. • పెన్షన్ దారుల మరణాలను ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీలకు ఆపాదించింది. • మే నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ ఉన్న ఈ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలి. • సజావుగా పెన్షన్ల పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. • రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా సచివాలయాల వద్ద పెన్షన్ దారులు నిరీక్షిస్తే లబ్దిదారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అకాశం ఉంది. • మానవతా దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారుల ఇంటి వద్దకే 1వ తేదీన పెన్షన్ పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలి. • గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పెన్షన్ పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంది. • ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలి. • ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు అదేశాలు ఇచ్చి...అమలు అయ్యేలా చూడాలని లేఖలో కోరిన చంద్రబాబు నాయుడు
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले