తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా జగన్ రెడ్డి సమాధాన చెప్పలేక తెల్లముఖం: జ్యోష్ణ

తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా జగన్ రెడ్డి సమాధాన చెప్పలేక తెల్లముఖం: జ్యోష్ణ

Share with
Views : 13
*వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో పరువు పోగొట్టుకున్న జగన్ రెడ్డి* *తెలుగులో అడిగినా కూడా సమాధానం చెప్పలేక తెల్లముఖం వెసిన వైనం* *వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో కూర్చున్న జగన్* *పరువు పోతుందని గూగుల్ లో వెతుక్కోవాలని కవర్ చేసిన సజ్జల భార్గవ్* తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా జగన్ రెడ్డి సమాధాన చెప్పలేక తెల్లముఖం వేయడం. వెర్రినవ్వులు, పిచ్చినవ్వులతో చూడటం.. ఎక్కడ పరువు పోతుందో అని సజ్జల భార్గవ్ రెడ్డి దాన్ని కవర్ చేయడం చూస్తే ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో ఉండటం చాలా బాధాకరంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు జగన్ తెల్లముఖం వెశాడు. తెలుగులో అడిగిన ప్రశ్నకు కూడా జగన్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. పక్కన ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఏదో చెప్పాలని ప్రయత్నించినా జగన్ రెడ్డికి అర్థం కాక వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులతో కూర్చుకున్నాడు. సమాధానం చెప్పకుంటే పరువు పోతుందని భయపడి సింపుల్ గా జగన్ రెడ్డి హిస్టరీని గూగుల్ లో వెతుక్కోమని చెప్పటం సిగ్గుచేటుగా ఉంది. జగన్ రెడ్డి గురించి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు తాను గూగుల్ లో వెతికిందో లేదో కాని.. జగన్ రెడ్డి ఎంత పెద్ద పారిశ్రామిక వెత్తో ఎంత పెద్ద ఆర్థిక సంస్కరణవంతుడో అని గుగుల్లో వెతికితే... చాంతాడంత లిస్ట్ వచ్చింది. ఏం లిస్ట్ వచ్చిందంటే. జగన్ రెడ్డి పెట్టిన సెల్ కంపెనీల లిస్ట్ వచ్చింది. జగన్ పై ఉన్న సీబీఐ ఈడీల ఛార్జ్ సీట్ ల లిస్ట్ వచ్చింది. 2004 తరువాత జగన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు గడించారో అనే లిస్ట్ వచ్చింది. ఇటువంటి హిస్టరీలు అన్నీ వచ్చాయి కాని.. ఏ రకమైనా కంపెనీలు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు. ఏం అభివృద్ధి చేశాడో గూగుల్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. జగన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉండగా 64 సెల్ కంపెనీలతో అవకతవకలు పాల్పాడ్డారు. ఆ సెల్ కంపెనీలు ఏంటో సీబీఐ ఎప్పుడో బయట పెట్టింది. 2014 నుండి 2019 వరకు ఒక్క సెల్ కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదు. 2019 -2024 లో మళ్లీ సెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడు. కొన్ని చూస్తే సిరిడీ సాయి ఎలక్ట్రీకిల్, ఇండోసోల్ లాంటివి జగన్ కు ఎంట్రప్రెన్యూర్ అంటే స్పెల్లింగ్ అయినా తెలుసా.? 2004 ముందు ఉన్న ఇంటిని అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్న జగన్ కుటుంబం ఉంది. 2004 తరువాత వేల కోట్లు ఆస్తులను ఎలా గడించారు. అంత తక్కువ సమయంలో వేల కోట్లు ఆస్తులు ఎలాయి వచ్చాయని సాక్ష్యత్తు సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 10 ఏళ్లలో వేల కోట్లు ఎలా సంపాధించారు అంటూ 2012లో బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ అమ్మాయి అడిగినట్లు ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ అంటే దోచుకోవడంలో జగన్ రెడ్డి పీహెచ్డీ చేసి స్కిల్ అని అనుకోవాలేమో. జగన్ రెడ్డి పై సీబీఐ 12 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈడీ మరో 2 ఛార్జి షీట్లను దాఖలు చేసింది. వీటన్నింటిలో ఏరకంగా జగన్ రెడ్డి దోచుకున్నదో కనిపిస్తుంది. సజ్జల భార్గవ్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి ఆ అమ్మాయి అడిగిందో... లేదా తెలియక అడిగిందో కాని దానికి కూడా సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. జగన్ రెడ్డికి ప్రశ్న అర్థం కాక సమాధానం చెప్పలేదా. తనలో తాను నవ్వుకున్నాడంటే.. తానేంటి ఎంట్రప్రెన్యూర్ ఏంటి తాను చేసింది అన్ని దొంగతనాలు, ఆర్థి నేరాలే కదా... తాను ఎక్కడ ఎంట్రప్రెన్యూర్ అనుకుంటాడు కదా జగన్ రెడ్డి. అలా అనుకోకుంటే మరి ఎందుకు ఆ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. తెలుగులో అడిగినా కూడా అర్థకం కాక చెప్పలేదా.? ఒక ఆర్థిక నేరస్తుడు ... బయటకు వచ్చి యువతను ఉద్దరిస్తానని రాష్ట్రాన్ని భాగు చేస్తానంటే జగన్ రెడ్డి చెప్పే కట్టు కథలు పిట్ట కథలు ఎవరు వింటారు? ఎవరు నమ్ముతారు. ఐదు సంవత్సరాల్లో స్కిల్ డెవలప్ మెంట్ ను అటకెక్కించారు. స్వయం ఉపాధి రూణాలను అటకెక్కించారు. ఎక్కడ కూడా యువతకు ప్రయోజన కరమైన ఆలోన చేయలేదు. అనుక్షణం కూడా కేవలం మద్యం ఎలా సప్లై చేద్దాం, గంజాయి ఎలా సప్లై చేద్దాం, రాష్ట్రంలో హింసను ఎలా ప్రేరేపిద్దామా ? రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఎలా తాకట్టు పెడదామా? జనాలను ఎలా దోచుకుందామా అనే ఆలోచనలే జనగన్ కు ఉన్నాయి. ఎక్కడా కూడా ఎంట్రప్రెన్యూర్ సిప్ డెవలెప్ మెంట్ కాని విద్యార్థులకు సంబంధించిన స్కిల్ డెవలప్ మెంట్ ఆలోచనలు ఏనాడు జగన్ చేయలేదు జగన్ రెడ్డిని ఏరకంగా ఒక పారిశ్రామిక వేత్త అని మనం చెప్పలేం. జగన్ ఏరోజు చూసినా ప్రజలను దోచుకోవడం దోచుకున్న సొమ్ము దాచుకోవడమే చేశాడు. ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలేదు. ఎన్నో ప్యాలెస్ లు కట్టుకున్నాడు. తన వెనక ఎంతో సంపదను సృష్టించుకున్నాడు. కాని రాష్ట్రానికి సంపద సృష్టించడంలో జగన్ రెడ్డికి జీరో మార్కులు ఇవ్వోచ్చు. నిన్న ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్ రెడ్డి తెల్లముఖం వేయడం చూస్తే ఇలాంటి అసమర్థులా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంది అని చాలా బాధ వేసింది. ఇదే ప్రశ్న లోకేష్ గారిని అడిగితే రేపు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలిగారు. జగన్ రెడ్డిది బేలతనం అనాలో.. చేతగానితనం అనాలో.. పిచ్చి నవ్వులు, వెర్రి నవ్వులు నవ్వితే ఏమనాలో అర్థం కావడంలేదు. దీన్ని యావత్ ఏపీ యువత గమనిస్తుంది. నిన్నటి ప్రోగ్రామ్ లో జగన్ ఐకాన్ అని చెప్పడం చూస్తే పక్కున నవ్వు వస్తుంది. జగన్ ఎందులో ఐకాన్ రాష్ట్ర ప్రజలను హింసించడంలోనా? వేల కోట్లు ఆస్తులు దోచుకోవడం దాచుకోవడంలోనా? మోసం చేయడంలోనా? ప్రజలను దగా చేయడంలోనా? ఎక్కడికి అక్కడ ప్యాలెస్ లు కట్టుకుని ఆస్తులను కూడగట్టుకోవడంలోనా? జగన్ రెడ్డి ఎవరికి ఐకాన్. ఇలా వ్యక్తునలను దోపిడీ దారులను ఆదర్శంగా తీసుకోమని ఏ తల్లండ్రులైనా పిల్లలకు చెబుతారా? ఇలాంటి వ్యక్తులు ఎలా ఆదర్శం అవుతారు అసలు. అని జ్యోత్స్న అన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले